Reading Time: < 1 minute

యూపీలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ బోల్తా.. 12 మంది మృతి

Caption of Image.

బాగ్‌‌‌‌పత్ (యూపీ): ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని బాగ్‌‌‌‌పత్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక పికప్ వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్‌‌‌‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో డజను మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో రాజస్తాన్ నుంచి ప్రయాణికులతో పికప్ వాహనం ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని బుడాన్ వైపు వెళ్తోంది. కేఖ్రా పోలీసు స్టేషన్ పరిధిలోకి రాగానే వాహనం డివైడర్‌‌‌‌ను ఢీకొట్టి బోల్తా పడింది. 

ఆ సమయంలో వాహనంలో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సహాయక సిబ్బంది తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. డయల్​112 కి చెందిన  అంబులెన్స్‌‌‌‌లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని కేఖ్రా, బాగ్‌‌‌‌పత్ హెల్త్ సెంటర్లతో పాటు జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.