
- తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్
నల్గొండ, వెలుగు: అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల అనిల్ డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండలోని క్లాక్ టవర్స్ సెంటర్‌లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ దేవాలయం లాంటి అసెంబ్లీలో స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.
సిద్ధిపేట టౌన్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ అన్నారు. మంగళవారం సిద్ధిపేటలో రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సీ సెల్ నాయకులు బొమ్మల యాదగిరి ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ లీడర్లు దహనం చేశారు.
సూర్యాపేట: స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడటం అత్యంత దుర్మార్గమని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది తల్లమల్ల హసేన్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అప్రజాస్వామిక వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని సూర్యాపేట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ అర్బన్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనలో అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు.