Reading Time: < 1 minute
Nandana Bigg Boss Wild Card Entry Arrested Fake Visa Case

Nandu: బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ చుట్టూ రోజూ సరికొత్త ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా వివాదాస్పద యూట్యూబర్ నందు హఠాత్తుగా హైదరాబాద్‌లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె ఏదో సాధారణ పర్యటన కోసమో లేదా సినిమా షూటింగ్ కోసమో రాలేదని, దీని వెనుక అసలు కథ వేరే ఉందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. నందు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టడం ఖాయమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. షోను మరింత రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు ఆమెను రంగంలోకి దించాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే, హౌస్‌లోకి అడుగుపెట్టే ప్రక్రియ ఆమెకు అనుకున్నంత సులువుగా సాగడం లేదు.

నందు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అనూహ్యంగా లీగల్ అడ్డంకులు బ్రేకులు వేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. షోలోకి వెళ్లడానికి ముందే ఆమె ఫేక్ వీసా కేసుకు సంబంధించి న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినట్లు సమాచారం. ఈ లీగల్ అడ్డంకులు పూర్తిగా తొలగిపోతే తప్ప ఆమె బిగ్ బాస్ గేట్ దాటడం అసాధ్యంగా మారినట్లు తెలుస్తోంది. నందు హైదరాబాద్ రావడానికి వెనుక అసలు రహస్యం ఈ న్యాయపరమైన వివాదాలేనని ఇండస్ట్రీ టాక్. బిగ్ బాస్ షోలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకోవడమే లక్ష్యంగా ఆమె నగరంలో అడుగుపెట్టారు. నిబంధనల ప్రకారం ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందస్తుగా ‘లీగల్ క్లియరెన్స్’ పొందేందుకు న్యాయవాదులతో కీలక సంప్రదింపులు జరపడానికి వచ్చారని, అయితే లుకౌట్ నోటీసులు ఉండడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే న్యాయపరమైన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని నందు అండ్ ఫ్యామిలీ విశ్వాసంతో ఉంది. ఆ క్లియరెన్స్ పత్రాలు చేతికి అందిన వెంటనే, ఏ క్షణమైనా నందు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ స్టేజీపై ప్రత్యక్షమై హౌస్‌మేట్స్‌కు షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.