Reading Time: 2 minutes

తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే ..సభలో కాంగ్రెస్, ఎంఐఎం సభ్యుల డిమాండ్

Caption of Image.
  • కర్‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌‌‌‌‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ చైర్‌‌‌‌‌‌‌‌ను అవమానించడమే కాకుండా, ఆయన తల్లిని ఉద్దేశించి మాట్లాడడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.  ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారి సభ్యత్వాలను రద్దు చేయాలని సభలో ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు: మట్టా రాగమయి 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి విమర్శించారు. గతంలోనూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌‌‌‌‌ను, సీనియర్ నేత కడియం శ్రీహరిని అవమానించేలా మాట్లాడారన్నారు. అసెంబ్లీ వద్ద విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసుల పట్ల కూడా బీఆర్ఎస్ లీడర్లు అమానుషంగా ప్రవర్తించారని, మహిళలకు బీఆర్ఎస్ నేతలు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభ, స్పీకర్‌‌‌‌‌‌‌‌ను అవమానించిన తాతా మధు, నవీన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.

ఆత్మ స్థైర్యం దెబ్బతీసేలా ఉంది: మేడిపల్లి సత్యం

బీఆర్ఎస్ సభ్యులు తాతా మధు, నవీన్ రెడ్డి స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చేసిన వ్యాఖ్యలు దళితుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉన్నాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఫ్యూడలిస్టిక్ విధానాలు అవలబిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులను పావులుగా వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో దళిత అధికారిని కొట్టి అగౌరవ పరిచిన చరిత్ర హరీశ్ రావుది అన్నారు. ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్​రెడ్డి దళితులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారన్నారని, దళితులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు.

వెనకేసుకురావడం సిగ్గుచేటు: దానం నాగేందర్

రాజ్యాంగబద్ధ  పదవిలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అవమానకరమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. ఇంత జరిగినా.. అసెంబ్లీలో హరీశ్ రావు మాట్లాడిన మాటలు మరింత బాధాకరమని పేర్కొన్నారు. తాతా మధు తిట్టలేదని చెబుతూ ఆయన్ను వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు. అని ఫైర్ అయ్యారు. స్పీకర్‌‌‌‌‌‌‌‌ను ఎవరు కించపరిచినా తప్పే.. అన్ని పార్టీల వాళ్లూ ఆయన్ను గౌరవించాల్సిందేనని పేర్కొన్నారు. స్పీకర్‌‌‌‌‌‌‌‌ను దూషించడాన్ని సహించేది లేదన్నారు.

బీఆర్ఎస్ నీచ రాజకీయం: యశస్విని రెడ్డి

మహిళలను ముందు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫైర్​అయ్యారు.  ‘మీ రాజకీయ లబ్ధి కోసం మహిళలను ఎందుకు ముందు పెడుతున్నారు? ’ అని నిలదీశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌‌‌‌‌‌‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన కామెంట్స్ చాలా బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు.  అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.