Reading Time: < 1 minute

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Caption of Image.

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలపై తెలంగాణ శాసన మండలి సస్పెన్షన్ వేటు వేసింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు.  మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఆమోదించింది. దీంతో తాతా మధు, నవీన్ రెడ్డిలను ప్రస్తుత అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ శాసన మండలి నిర్ణయం తీసుకుంది.  సస్పెన్షన్ అనంతరం తెలంగాణ శాసన మండలి సమావేశాలను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేశారు.

అసెంబ్లీలోనూ ఏకగ్రీవంగా తీర్మానం

 స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని   తాతా మధు, నవీన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని  అసెంబ్లీలోనూ మంత్రి దామోదర రాజనర్సింహ తీర్మానం ప్రవేశపెట్టారు.ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.ఈ తీర్మానం కాపీని శాసన మండలి ఛైర్మన్‌కు పంపించింది. 

స్పీకర్ వ్యాఖ్యలపై వివాదం

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అసెంబ్లీ, మండలిలో అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ పదవికి, శాసనసభ గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అధికార పక్ష సభ్యులు అన్నారు.  ఈ నేపథ్యంలో తొలుత అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందగా.. అనంతరం అదే అంశంపై శాసన మండలిలోనూ చర్యలు తీసుకున్నారు. తాతా మధు, నవీన్ రెడ్డిలను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

©️ VIL Media Pvt Ltd.