Reading Time: 2 minutes
Ranabaali Movie: అభిమానులకు క్రేజీ సర్ ప్రైజ్.. విజయ్, రష్మిక మూవీ రణబాలి టీజర్ వచ్చేది అప్పుడే..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటేస్త్ మూవీ రణబాలి. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రణబాలి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది ఈ జంట. ఇటీవల విజయ్, రష్మిక పెళ్లి తర్వాత విడుదలైన ఫస్ట్ పోస్టర్, ఏందయ్య సామి సాంగ్ యూట్యూబ్ లో విపరీతమైన రెస్పాన్స్ అందుకుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రణబాలి టీజర్ విడుదలయ్యే డేట్ చెప్పింది చిత్రయూనిట్.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

రణబాలి టీజర్ ను సెప్టెంబర్ 9న తేదీన రిలీజ్ చేయనున్నారు. అలాగే దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 19వ శతాబ్దపు బ్రిటిష్ పాలన కాలం నాటి చారిత్రక నేపథ్యం, రాయలసీమ ప్రాంత ఆధిపత్య పోరాటాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. ఇందులో విజయ్ రగ్గడ్ లుక్ లో కనిపించనుండగా.. సంప్రదాయబద్దమైన గ్రామీణ మహిళ పాత్రలో రష్మిక కనిపించనుంది.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

ఇటీవల విడుదలైన రష్మిక, విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

రణబాలి అప్డేట్..

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..