Reading Time: < 1 minute

సిద్దిపేట వంటిమామిడి హైవేపై తగలబడ్డ కారు.. నలుగురు సేఫ్

Caption of Image.

 

సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి రాజీవ్ రహదారిపై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శామీర్‌పేట మండలం కోల్తూర్‌కు చెందిన ప్రశాంత్‌కు ఈ కారు చెందినదిగా సమాచారం.

ములుగు మండల పరిధిలోని లక్ష్మక్కపల్లికి వెళ్తుండగా వంటిమామిడి రాజీవ్ రహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే మంటలు కారంతా వ్యాపించడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. 

అయితే కారులో ఉన్న నలుగురు సకాలంలో బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

©️ VIL Media Pvt Ltd.