Reading Time: < 1 minute
Brs Mlc Tata Madhu Arrested Hyderabad Assembly Controversy

BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారు జామున హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఫ్లాట్ నెంబర్ 11లో ఎమ్మెల్సీ తాత మధు నివాసం వద్దకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో క్వాటర్స్ వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా.. నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తతల మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్సీని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై సోమవారం బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu) స్పందించారు. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అంటే తనకు గౌరవముందని, అనని మాటలను తనకు ఆపాదించడం సరికాదని తెలిపారు. ‘‘స్పీకర్‌ను నేనేమీ అనలేదు. ఆయన్ను అన్నట్లు భావిస్తే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. నా మాటలపై విచారం వ్యక్తం చేస్తున్నా. నాపై దాడి చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. నాపై దాడి చేసిన వారిని మాత్రమే ఆవేశంతో అన్నాను’’ అని వివరణ ఇచ్చారు.