Reading Time: 2 minutes

ఉపసర్పంచ్ చెక్ పవర్‎కు టైమ్ లిమిట్.. వారం దాటితే కలెక్టర్ చేతికి నిర్ణయాధికారం

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య ఏండ్లుగా సాగుతున్న ‘చెక్ పవర్’ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శాశ్వతంగా ఫుల్​స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోతుండడం, కేంద్ర, రాష్ట్ర నిధులు వినియోగంలోనూ అడ్డంకులు ఎదురవుతుండడంతో ఈ సమస్య పరిష్కారంపై పంచాయతీరాజ్​శాఖ దృష్టి సారించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనలను సవరిస్తూ.. ఉప సర్పంచుల చెక్​పవర్​పై ‘టైమ్ లిమిట్’ విధించే కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. 

రాజకీయ కక్షలకు కారణమైన జాయింట్ చెక్ పవర్

గతంలో గ్రామ పంచాయతీల్లో నిధుల డ్రా కోసం సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలకు జాయింట్ చెక్​పవర్​ఉండేది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి.. సెక్రటరీ స్థానంలో ఉప సర్పంచ్​కు చెక్​పవర్ ఇచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. నిధుల విడుదలలో ఉపసర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నామని అప్పట్లో పాలకులు చెప్పినప్పటికీ.. ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో తీవ్ర రాజకీయ కక్షలకు దారితీసింది. 

సాధారణంగా ఎంబీ రికార్డ్ ఆధారంగా గ్రామ పంచాయతీ తీర్మానాన్ని జత చేసి, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సిస్టమ్ లో బిల్లు పెడతారు. సర్పంచ్, ఉపసర్పంచులు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సంతకం లేదా డిజిటల్ కీ ద్వారా ఆమోదిస్తేనే.. కాంట్రాక్టర్ కు లేదా సర్పంచ్ ఖాతాకు నిధులు జమ అవుతాయి. కానీ అధికారులు ఎంబీ రికార్డ్ చేసి అంతా సవ్యంగా ఉందని ధ్రువీకరించినా.. గ్రామంలోని రాజకీయ విభేదాల వల్ల ఉపసర్పంచులు తమ డిజిటల్ కీ ఇవ్వకుండా, సంతకాలు చేయకుండా బిల్లులను తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి.  

రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ గ్రామాల్లో సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య రాజకీయ విభేదాలు తీవ్రమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సర్పంచ్​స్థానాలు రిజర్వ్​అయిన పంచాయతీల్లో జాయింట్​చెక్​పవర్​కారణంగా అగ్రవర్ణాలకు చెందిన ఉపసర్పంచులు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దీని వల్లే ప్రభుత్వం ఇప్పుడు ఉపసర్పంచ్ చెక్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఏడు రోజుల టైమ్ లిమిట్ విధించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.

వారం దాటితే కలెక్టర్ ​చేతికి…

ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే సెక్రటరీలకు ఇవ్వాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నరు. కానీ ఆ అధికారాన్ని పూర్తిగా లాగేసుకుంటే ఉప సర్పంచుల నుంచి వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం మధ్యేమార్గం ఎంచుకున్నట్లు సమాచారం. ఉప సర్పంచులకు చెక్​ పవర్​ను పూర్తిగా రద్దు చేయకుండా.. కొన్ని కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు తెలిసింది. పంచాయతీలో పూర్తయిన పనుల బిల్లుల చెక్కుపై వారం రోజుల్లోగా ఉపసర్పంచ్ సంతకం చేయాల్సి ఉంటుంది. 

ఒకవేళ రాజకీయ లేదా ఇతర కారణాలతో సంతకం చేయకుండా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెడితే.. ఆ అధికారం నేరుగా కలెక్టర్ కు దఖలు పడుతుంది. కలెక్టర్ క్షేత్రస్థాయి నివేదిక పరిశీలించి, ఉపసర్పంచ్ సంతకంతో సంబంధం లేకుండా నేరుగా నిధుల విడుదలకు ‘ప్రొసీడింగ్స్’ ఇచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. రాబోయే కేబినెట్ భేటిలో ఈ ప్రతిపాదనలపై చర్చించి, ఆమోదం పొందిన తర్వాత తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
 

©️ VIL Media Pvt Ltd.