
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో రోజు ఆట అత్యంత ఆసక్తికరంగా, గొడవలతో వేడెక్కింది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా అగ్ని పరీక్ష నుంచి హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ రోహిత్ ప్రవర్తనపై యాంకర్ వర్షిణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా డివైడ్ చేశారు బిగ్ బాస్. సెలబ్రిటీల వైపు నుంచి రాం ప్రసాద్, కామనర్స్ వైపు నుంచి రోహిత్‌ను లీడర్లు ఎంచుకున్నారు. అనంతరం మిగిలిన 12 మంది సభ్యులను తమ సైన్యంలోకి చేర్చుకోవడానికి ఒక ‘బ్యాగ్ టాస్క్’ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఉన్న బ్యాగ్‌లలోని బ్యాడ్జ్‌ల ఆధారంగా లీడర్లు సైనికులను ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలో రోహిత్.. అమన్, టెంపర్ వంశీ, శాలినిలకు రెడ్ బ్యాడ్జ్ ఇచ్చి తన టీమ్‌లోకి తీసుకున్నాడు. మరోవైపు రాం ప్రసాద్.. నరేష్, దేబ్జానీ, ముఖేష్ గౌడలకు బ్లూ బ్యాడ్జ్‌లు ఇచ్చి ఎంచుకున్నాడు. చివరికి కృష్ణుడు, చైత్ర మిగలగా, రోహిత్ మాట్లాడుతూ కృష్ణుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. “ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నందున చైత్రను నా టీమ్‌లోకి తీసుకోకుండా, కృష్ణుడికి బ్యాడ్జ్ ఇస్తున్నా” అని చెప్పడంతో కృష్ణుడు తీవ్రంగా హర్ట్ అయ్యాడు. ఇక రాంప్రసాద్ మాట్లాడుతూ.. నాకు వేరే ఆప్షన్ లేదు.. చైత్రని పిక్ చేసుకుని కృష్ణుడుని నా టీంలోకి తీసుకుంటున్నా అని అన్నాడు.
ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..
రోహిత్ యాటిట్యూడ్ పై వర్షిణి సీరియస్..
ఇక తర్వాత బిగ్ బాస్ హౌస్‌కు అనర్హులైన వారిని ఎన్నుకునే టాస్క్ ఇచ్చారు. ఇందులో యాంకర్ వర్షిణి అనూహ్యంగా రోహిత్ పేరును ప్రతిపాదించి అతడిని ఏకిపారేసింది. “అగ్నిపరీక్ష టాస్క్ చూసినప్పుడు రోహిత్‌తో మంచి వైబ్ ఉంటుందని, అతడు నాకు సెట్ అవుతాడని అనుకున్నా. కానీ హౌస్‌లోకి వచ్చాక తను ఏదో ‘పెద్ద తోపు’లా ఫీల్ అవుతున్నాడు. నా అంతటోడు లేడు అన్నట్లు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు” అని వర్షిణి మండిపడింది. “అగ్నిపరీక్షలో అతడిని బాగా లేపి లేపి కూర్చోబెట్టారు. దాంతో అతడి కళ్లు నెత్తికెక్కాయి. ఇంకా అక్కడక్కడే తిరుగుతున్నాడు. త్రిగుణ్ ‘గ్రూప్ గేమ్’ అనగానే రోహిత్ భరించలేకపోయాడు. దొంగని దొంగ అంటే ఎంత కోపం వస్తుందో అతడికి అంత కోపం వచ్చింది. ‘మీ అందరి ఎంగిలి నేను కడగాలా?’ అని యాక్షన్ చేస్తూ మాట్లాడాడు. మనకేమైనా రోగాలు ఉన్నాయా? అతడికి రియాలిటీ ఏంటో తెలియజెప్పి కిందకి దింపాలి” అంటూ కోపంతో రగిలిపోయింది.
ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..
మరోవైపు నటి దేబ్జానీ మోదక్.. శాలినిని అనర్హురాలిగా పేర్కొంది. శాలిని ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతోందని, ఇంట్లో ఉన్నవారంతా మంచి కుటుంబాల నుంచి వచ్చినా, తనేదో గొప్ప వ్యక్తి అని ఫీల్ అవుతోందని ఘాటుగా విమర్శించింది. మొత్తానికి రెండో రోజే బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు ముదిరి ఆట మరింత రసవత్తరంగా మారింది. మొత్తానికి మొదలైన ఒకటి రెండు రోజుల్లోనే హౌస్ మొత్తం రణరంగంలా మారింది.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..