Reading Time: < 1 minute

టీవీఎస్ జూపిటర్ 125లో తయారీ లోపంపై.. కస్టమర్ ఫిర్యాదు.. వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు…

Caption of Image.

టీవీఎస్ జూపిటర్ 125 వాహనంలో తయారీ లోపంపై కస్టమర్ చేసిన ఫిర్యాదు మేరకు సంచలన తీర్పు వెల్లడించింది కృష్ణా జిల్లా వినియోగదారుల కమిషన్. వాహనాన్ని రిటర్న్ తీసుకొని 30 రోజుల్లో కొత్త వాహనం తిరిగి ఇవ్వాలని లేదా బైక్ ఖరీదు రూ. లక్షా 15వేల 500 9శాతం వడ్డీతో చెల్లించాలని, మానసిక ఒత్తిడి కలగచేసినందుకు రూ.25 వేలు, లీగల్ ఖర్చులకు రూ. పది వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు లక్ష్మణ్ కుమార్ అతని భార్య బొమ్మిశెట్టి వెంకట నాగ దీప్తి మచిలీపట్నంలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. 2024 జులై ఒకటో తారీఖున నాగ దీప్తి మచిలీపట్నం జిల్లా పరిషత్ ఎదురుగా గల టీవీఎస్ డీలర్ కసా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర రూ.లక్షా15వేల 500 చెల్లించి టీవీఎస్ జూపిటర్ 125 కొన్నారు. కొన్న రోజు నుండి వాహనంలో తయారీలోపం వలన పలు ఇబ్బందులకు గురిచేసింది. 

ఏడుసార్లు సర్వీసింగ్ చేయించినా లాభం లేకపోయింది. దీప్తి ఆమె భర్త లక్ష్మణ కుమార్ చాలాసార్లు మచిలీపట్నం, విజయవాడలోని కాసా మోటార్స్ ను సంప్రదించిన ఫలితం లేకపోయింది. విసిగివేసారిన బాధితులు న్యాయం కోసం కృష్ణా జిల్లా వినియోగదారుల కమిషన్ లో 2025 జూన్ 30న ఫిర్యాదు చేశారు. వినియోగదారుల కమిషన్ ఇరుపక్షాల వాద ప్రతివాదంలో విన్న తర్వాత వాహనాన్ని శిక్షణ పొందిన మెకానిక్ తో పరీక్ష చేయించి వాహనం తయారీలో లోపం ఉన్న విషయాన్ని నిర్ధారించారు. 

టీవీఎస్ వాహనంలో తయారీలో ఉందని వినియోగదారులకు ఇబ్బంది కలగజేసినట్లుగా నిర్ధారిస్తూ కమిషన్ బుధవారం తీర్పు చెప్పింది. తీర్పు ప్రకారం 30 రోజుల్లోపు కొత్త వాహనం గాని, వాహన ఖరీదును 9 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని 25 వేల రూపాయలు మానసిక ఒత్తిడికి గురి చేసినందుకు పదివేల రూపాయలు కోర్టు ఖర్చులు కింద చెల్లించాలని తీర్పు వెల్లడించింది వినియగదారుల కమిషన్.

©️ VIL Media Pvt Ltd.