
Ashish Nehra: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పని తీరుపై ఇటీవల విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, టీమిండియా తదుపరి కోచ్ రేసులో పలువురు దిగ్గజాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టును అద్భుతంగా నడిపిస్తున్న ఆశిష్ నెహ్రా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా అడుగు పెట్టిన తొలి ఏడాదే (2022) ఐపీఎల్ ట్రోఫీని అందించడమే కాకుండా, 2023, 2026 సీజన్లలో జట్టును రన్నరప్‌గా నిలబెట్టిన ఘనత నెహ్రాది. దీంతో ఇండియన్ కోచ్‌గా బాధ్యతలు చేపడతారా అనే ప్రశ్నపై నెహ్రా చేసిన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
మా ఆవిడ పర్మిషన్ కావాలి లేకపోతే విడాకులే:
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) వార్షిక పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న నెహ్రాను టీమిండియా కోచింగ్ ఆఫర్ గురించి ప్రశ్నించగా తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. భారత జట్టుకు కోచింగ్ ఇవ్వడం అనేది గౌరవంతో కూడినది, అదో గొప్ప ఆవకాశం. కానీ ఆ ఆఫర్ వస్తే ముందుగా మా ఇంట్లోని హైకమిషన్ అయిన నా భార్యను అడిగి పర్మిషన్ తీసుకోవాలన్నాడు. లేకపోతే నాకు విడాకులు రావడం ఖాయం! ఎందుకంటే అంతర్జాతీయ కోచ్‌గా పని చేయడం అంటే ఏడాదిలో 8 నుంచి 9 నెలలు నిరంతరం ప్రయాణాలు చేయాల్సి ఉంది. అది అంత తేలికైన విషయం కాదని నెహ్రా సరదాగా చెప్పుకొచ్చాడు.
నాకేమీ ప్రత్యేక ఆశలు లేవు:
కోచింగ్ ఆంబిషన్స్ గురించి మాట్లాడుతూ తనకు ఎలాంటి ప్రత్యేకమైన కోరికలు లేవని ఆశిష్ నెహ్రా స్పష్టం చేశాడు. నేను ముందే ప్లాన్ చేసుకోను, ప్రస్తుతం ఉన్న స్థితితో ఎంతో సంతోషంగా ఉన్నాను.. గుజరాత్ టైటాన్స్‌తో నా సక్సెస్ గురించి అంతా మాట్లాడుతున్నారు, కానీ ఆ విజయం నా ఒక్కడిది కాదు, మొత్తం జట్టు శ్రమ.. సాధారణంగా ఇండియాలో కెప్టెన్, కోచ్‌లకు మాత్రమే సక్సెస్ క్రెడిట్ ఇస్తుంటారు, కానీ నేను ఆ సంస్కృతికి పూర్తిగా వ్యతిరేకం అని నెహ్రా తేల్చిచెప్పాడు.
ఇంటర్నేషనల్ కోచింగ్ సవాళ్లు:
అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘకాలం కోచ్‌గా కొనసాగడం ఎంతో ఒత్తిడితో కూడుకున్న విషయమని నెహ్రా అభిప్రాయపడ్డాడు. నిరంతర ప్రయాణాలు, మ్యాచ్ ఫలితాల ఒత్తిడి కారణంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఏ కోచ్ కూడా 3-4 ఏళ్లకు మించి పని చేయలేకపోతున్నారని గుర్తు చేశాడు. భవిష్యత్తులో భారత జట్టు కోచింగ్ బాధ్యతలపై ఏం జరుగుతుందో వేచి చూడాలని, ప్రస్తుతం తానెలాంటి ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం లేదన్నాడు. ఆశిష్ నెహ్రా ఇచ్చిన ఈ ప్రాక్టికల్ అండ్ ఫన్నీ ఆన్సర్ ప్రస్తుతం క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Ashish Nehra: Shubman and Hardik are like North and South Poles.
Shubman Gill’s captaincy is a “work-in-progress”, feels former India cricketer Ashish Nehra.
The Gujarat Titans head coach compared Gill’s captaincy with Hardik Pandya as North and South poles.
Nehra also… pic.twitter.com/J8RoDNXd67
— RevSportz Global (@RevSportzGlobal) September 8, 2026