Reading Time: 2 minutes

Irumudi OTT Release : ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో దుమ్మురేపిన మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Caption of Image.

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు ‘ఇరుముడి’రూపంలో మరో బిగ్ హిట్ దక్కింది. కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయిన ఈ మాస్ హీరో.. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా మరోసారి చాటారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. మాస్ ఇమేజ్‌కు భిన్నంగా రవితేజలోని సెన్సిటివ్ యాక్టర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ‘ఇరుముడి’ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్. అంతేకాదు.. సెప్టెంబర్ 18, 2026 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను అందుబాటులోకి తీసుకురావచ్చని సమాచారం. అయితే ఓటీటీ రిలీజ్ డేట్, భాషలపై నెట్‌ఫ్లిక్స్ లేదా మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘ఇరుముడి’ కథ విషయానికి వస్తే.. తన చిన్నారి కూతురు కోరిక మేరకు తండ్రి పవిత్ర అయ్యప్ప దీక్ష చేపట్టే నేపథ్యంలో కుటుంబ అనుబంధాలు, తండ్రీకూతుళ్ల ఎమోషన్ చుట్టూ కథ సాగుతుంది. ముఖ్యంగా రవితేజ, చిన్నారి నక్షత్ర మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. మాస్ హీరోగా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌కు అలవాటుపడిన అభిమానులకు.. ఇందులో రవితేజ చూపించిన ఎమోషనల్ యాక్టింగ్ కొత్త అనుభూతిని ఇచ్చింది.

సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ట్రేడ్ వర్గాల ప్రకారం 19 రోజుల్లో ఇండియాలో రూ.198.65 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా రూ.225 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, సాయికుమార్, సునీల్, రమేష్ ఇందిరా, స్వాసిక విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇప్పుడు ఓటీటీలో ‘ఇరుముడి’ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.