
భిషేక్, కాజల్ చౌదరి జంటగా వేణు కార్తికేయన్ దర్శకత్వంలో రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న చిత్రం ‘గోల్డ్ స్పాట్’. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఫేమ్ దుష్యంత్ కటికనేని కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. సోమవారం ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. హీరోయిన్ తన ప్రాణానికి ప్రాణమైన తన స్నేహితుడు రామ్ గురించి చెబుతూ ప్రారంభమైన వీడియో ఆసక్తికరంగా సాగింది. ‘అమ్మను చిన్నప్పుడే తీసుకువెళ్లిపోయిన ఆ దేవుడే, నాకు రామ్‌ను పరిచయం చేశాడు.
మనకు జీవితంలో ఎంతోమంది పరిచయమవుతుంటారు. కానీ ఒక్కరే జీవితంగా మారిపోతారు..’ అని కాజల్ చౌదరి చెప్పే డైలాగ్ హార్ట్ టచింగ్‌గా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, ఈ గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. విజయ్ కృష్ణ లింగమనేని సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నరేన్ రెడ్డి సంగీతం అందిస్తున్నాడు.