
India vs Japan: జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ 2026 సమరానికి సరిగ్గా ముందు టీమిండియా ఓ అరుదైన చారిత్రాత్మక పోరుకు రెడీ అవుతోంది. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 22వ తేదీన భారత్, జపాన్ జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది. ప్రపంచ టీ20 ఛాంపియన్ అయిన టీమిండియాతో తలపడేందుకు జపాన్ క్రికెట్ బోర్డు తమ పవర్‌ఫుల్ స్క్వాడ్‌ను ప్రకటించింది. ఈ పోరులో ఇండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, శ్రేయస్ సేనకు మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చే సామర్థ్యం ఉన్న కొంతమంది డేంజరస్ ప్లేయర్లు జపాన్ జట్టులో ఉన్నారు.
భారత లెఫ్ట్ హాండర్లకు ఆఫ్‌స్పిన్ గండం:
జపాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న కేండెల్ కాడోవాకి-ఫ్లెమింగ్ ఆ జట్టు ప్రధాన బ్యాటర్. ఇప్పటి వరకు 55 అంతర్జాతీయ టీ20ల్లో దాదాపు 140 స్ట్రైక్ రేట్‌తో 1,871 రన్స్ చేయడమే కాకుండా రెండు సంచలన సెంచరీలు కూడా బాదాడు. ఇక టీమిండియా అటాకింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మలను దెబ్బకొట్టేందుకు జపాన్ ఆఫ్ స్పిన్నర్ ఇబ్రహీం తకాహాషి పక్కా స్కెచ్ వేశాడు. భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌పై ఉన్న బలహీనతను ఆసరాగా చేసుకుని పవర్ ప్లేలోనే వికెట్లు పడగొట్టేందుకు తకాహాషి రెడీ అయ్యాడు.
యూట్యూబ్‌లో షేన్ వార్నే వీడియోలు చూసి స్పిన్ మ్యాజిక్:
జపాన్ స్పిన్ విభాగంలో 30 ఏళ్ల లెగ్ స్పిన్నర్ మకోతో తనియామా భారత్‌కు ప్రధాన ముప్పుగా మారనున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్నేను ఆరాధ్యదైవంగా భావించే తనియామా, యూట్యూబ్‌లో వార్నే వీడియోలు చూసి తన బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకున్నాడు. 23 నంబర్ జెర్సీతో బరిలోకి దిగే ఈ లెగ్ స్పిన్నర్ 40 మ్యాచ్‌ల్లో 5.6 ఎకానమీతో 42 వికెట్లు తీసి భారత మిడిలార్డర్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అతడికి తోడుగా ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ బౌలర్ చార్లీ హారా-హింజ్ 4.96 అత్యుత్తమ ఎకానమీతో 45 వికెట్లు తీసుకుని ప్రత్యర్థి బ్యాటర్ల పాలిట విలన్‌గా మారనున్నాడు.
ALSO READ : T20ల్లో నమన్ ధీర్ తుఫాన్ బ్యాటింగ్.. అయ్యర్ సేనలో అతడే హాట్ టాపిక్
పేపర్‌పై భారత్ స్ట్రాంగ్.. కానీ జపాన్ వైపు నుంచి గట్టి పోటీ:
కాగితంపై, అనుభవంలో భారత జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, జపాన్ జట్టు స్పిన్ త్రయం, అటాకింగ్ కెప్టెన్ కాడోవాకి ఫామ్‌ను శ్రేయస్ అయ్యర్ సేన తేలిగ్గా తీసుకునే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. ఆసియా గేమ్స్ స్వర్ణ పతక వేటకు ముందు జరుగుతున్న ఈ చారిత్రాత్మక పోరులో జపాన్ టీమ్ విసిరే సవాళ్లను ఎదుర్కొని ఇండియన్ టీమ్ ఏ రకమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందో చూడాల్సి ఉంది.
India vs Japan one-off T20I match:
TV – Sony Sports.
Streaming – Fancode.
Date – 22 September.
Time – 9:30 AM IST.
Venue – Sano International Ground. pic.twitter.com/lRBuT4aHIo
— Danish (@BhttDNSH100) September 8, 2026