మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల డిసెంబర్ 5 లోగా ఎటువంటి అనారోగ్యాల నుంచైనా కోలుకోవడానికి అవకాశం ఉంది. సుఖ స్థానమైన చతుర్థ స్థానంలో గురువు కూడాఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల అనారోగ్యం కలగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నవారికి సరైన వైద్యం లభించే అవ కాశం ఉంది. శస్త్ర చికిత్సలకు అవకాశం ఉండకపోవచ్చు. ఇతరుల మీద ఆధారపడడం జరగదు.
వృషభం: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడి అనుకూలతతో పాటు, లాభ స్థానంలో శనీశ్వరుడి స్థితి వల్ల అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకునే అవకాశం ఉంది. అనారోగ్యాలు లేనివారికి ఆరోగ్య భంగం జరిగే అవకాశం లేదు. దీర్ఘకాలిక అనారోగ్యాలతో అవస్థలు పడుతున్నవారికి చాలా వరకు విముక్తి లభించే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుముఖం పడతాయి. శస్త్ర చికిత్సలకు ఆస్కారం లేదు. సరైన వైద్యుడు, చికిత్స అందుబాటులో ఉంటాయి. ప్రమాదాలకు అవకాశంలేదు.
కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల అక్టోబర్ 31 లోగా ఈ రాశివారు ఎటువంటి అనారోగ్యం నుంచి అయినా కోలుకునే అవకాశం ఉంది. అనారోగ్యాలు దగ్గ రకు వచ్చే అవకాశం లేదు. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధుల నుంచి కూడా చాలావరకు ఉపశమనం లభిస్తుంది. సరైన వైద్యం, సరైన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. అయితే, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
తుల: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి రవి, కేతువుల సంచారం వల్ల ఈ రాశివారికి డిసెంబర్ 5 లోగా అనారోగ్యాల నుంచి పూర్తిగా విముక్తి లభించే అవకాశం ఉంది. అనారోగ్యాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. ఆరోగ్యం బాగా మెరుగ్గా సాగిపోతుంది. చిన్న అనారోగ్యం చేసినా అతి త్వరగా, అతి వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది. సరైన వైద్యుడు దొరకడం, సరైన చికిత్స లభ్యం కావడం జరుగుతుంది. శస్త్రచికిత్సలకు అవకాశం లేదు. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి.
వృశ్చికం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఈ నెల 23 వరకు బుధుడు, ఆ తర్వాత అక్టోబర్ 16 వరకు రవి సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. సాధారణంగా అనారో గ్యంతో అవస్థపడడం జరగకపోవచ్చు. సరైన వైద్యుడు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి స్వల్ప అనారోగ్యం కూడా దగ్గరికి వచ్చే అవకాశం లేదు. వైద్య ఖర్చులు బాగా తగ్గు తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధులు కూడా తప్పకుండా తగ్గుముఖం పడతాయి.
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో జనవరి 2 వరకు శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఎటువంటి అనారోగ్యం నుంచైనా క్రమంగా కోలుకోవడం జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభి స్తుంది. స్వల్పకాలిక అనారోగ్యాలకు కూడా అవకాశం ఉండదు. అనుకోకుండా సరైన చికిత్స లభించి దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది. అయితే,ఆహార, విహారాల్లో జాగ్రత్త అవసరం. వైద్య ఖర్చులు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదు.





