
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలకు రావాల్సిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (ఎస్‌ఎఫ్‌సీ) నిధులతోపాటు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ డిమాండ్ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీల నిధులపై సమగ్రంగా చర్చించి, తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.