Reading Time: 2 minutes

టిక్కెట్ల కోసం ఫ్యాన్స్ వార్.. జస్ట్ 2 వారాల్లో 50 వేల టిక్కెట్లు హాంఫట్: కివీస్ గడ్డపై టీమిండియా మాస్ మేనియా!

Caption of Image.

India vs New Zealand: భారత క్రికెట్ అభిమానులకు రాబోయే రోజుల్లో నాన్-స్టాప్ క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది. భారత క్రికెట్ జట్టు (Team India) అత్యంత బిజీ షెడ్యూల్‌తో ఫుల్ ప్యాక్ అయిపోయింది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో 3 టీ20ల సిరీస్‌లో తలపడనున్న ఇండియా.. ఆ వెంటనే ఆసియా క్రీడలు, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లు ముగిసిన వెంటనే టీమిండియా, న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరనుంది. 2019 తర్వాత తొలిసారిగా భారత జట్టు కివీస్ గడ్డపై అడుగు పెడుతుండటంతో ఈ సిరీస్ పై అక్కడి క్రికెట్ అభిమానుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది.

టిక్కెట్ల కోసం ఫ్యాన్ వార్.. ఆక్లాండ్ స్టేడియంలో అదనపు సీటింగ్: 

అక్టోబర్ 22వ తేదీన క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగే తొలి టీ20తో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇండియా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. సోమవారం సాధారణ ప్రజలకు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభం కాగా, కొద్ది గంటల్లోనే 75 శాతానికి పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ముఖ్యంగా అక్టోబర్ 30న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగే నాలుగో టీ20కి ఊహించని డిమాండ్ రావడంతో, గ్రౌండ్ చరిత్రలోనే మొదటిసారిగా స్టేడియంలో ఆరో అంచే సీటింగ్ (అదనపు సీటింగ్) తెరవాల్సి వచ్చింది.

క్రైస్ట్‌చర్చ్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు.. రికార్డు కలెక్షన్స్ ఖాయం: 

క్రైస్ట్‌చర్చ్‌లో జరగబోయే మొదటి రెండు టీ20లతో పాటు వెల్లింగ్టన్, హామిల్టన్ వేదికల్లో జరిగే మ్యాచ్‌ల టిక్కెట్లు కూడా హౌస్‌ఫుల్ దిశగా దూసుకెళ్తున్నాయి. ఏడేళ్ల విరామం తర్వాత భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచులని వీక్షించేందుకు ప్రవాస భారతీయులతో పాటు స్థానిక కివీస్ అభిమానులు తెగ పోటీ పడుతుండటంతో ఈ సిరీస్ ద్వారా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరడం ఖాయంగా కనిపిస్తోంది.

5 టీ20ల సిరీస్:

* అక్టోబర్ 22 – తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్)
* అక్టోబర్ 24 – రెండో టీ20 (క్రైస్ట్‌చర్చ్)
* అక్టోబర్ 27 – మూడో టీ20 (వెల్లింగ్టన్)
* అక్టోబర్ 30 – నాలుగో టీ20 (ఆక్లాండ్)
* నవంబర్ 1 – ఐదో టీ20 (హామిల్టన్)

5 వన్డేల సిరీస్:

* నవంబర్ 4 – తొలి వన్డే (ఆక్లాండ్)
* నవంబర్ 7 – రెండో వన్డే (వెల్లింగ్టన్)
* నవంబర్ 10 – మూడో వన్డే (హామిల్టన్)
* నవంబర్ 13 – నాలుగో వన్డే (మౌంట్ మాంగనుయ్)
* నవంబర్ 15 – ఐదో వన్డే (మౌంట్ మాంగనుయ్)

2 టెస్టుల సిరీస్:

* నవంబర్ 19 నుంచి 23: తొలి టెస్టు (వెల్లింగ్టన్)
* నవంబర్ 27 – నుంచి డిసెంబర్ 1: రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్)

©️ VIL Media Pvt Ltd.