
ఢిల్లీ: జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న 28 ఏళ్ల యువకుడు, సివిల్ సర్వీసెస్ అభ్యర్థి జర్నలిస్ట్ సుధీర్ చౌదరిపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ పరువు నష్టం కేసులో, జర్నలిస్ట్ సుధీర్ చౌదరి, ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ న్యూస్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది.
కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయ ప్రచార వాలంటీర్ అయిన విక్రమ్ షెరావత్, జూలై 27న జరిగిన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పార్లమెంటును నాశనం చేయాలని, భారతదేశంలో “నేపాల్ లాంటి పరిస్థితి”ని సృష్టించాలని తాను పిలుపునిచ్చినట్లు చౌదరి తనపై ఆరోపించారని తన పిటిషన్‌లో విక్రమ్ వివరించారు.
చౌదరి తనను “దేశద్రోహి” అని అభివర్ణించారని విక్రమ్ షెరావత్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న తనను అప్రతిష్టపాలు చేయడానికి, శాంతియుత నిరసనను దేశద్రోహంగా చిత్రీకరించడానికి, ప్రజల్లో అశాంతిని, ద్వేషాన్ని రగల్చడానికి ఉద్దేశించిన దురుద్దేశపూర్వక చర్య అని జర్నలిస్ట్ సుధీర్ చౌదరిపై విక్రమ్ షెరావత్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. చౌదరి, అతని నిర్మాణ సంస్థ ఎస్ప్రిట్ ప్రొడక్షన్స్, దూరదర్శన్ న్యూస్ నుంచి షెరావత్ రూ. 5 కోట్ల నష్టపరిహారం కోరారు.
►ALSO READ | కాగ్నిజెంట్‌కు భారీ షాక్: గ్రీన్ కార్డ్ దరఖాస్తులను నిలిపివేసిన అమెరికా