
మలయాళీ ముద్దుగుమ్మ అనశ్వర రాజన్ ( Anaswara Rajan ) ఫుల్ జోరులో ఉంది. వరుసగా టాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఇటీవల ‘అంత రాములోరు చూసుకుంటారు’ ప్రాజెక్టుపై సంతకం చేసింది. ఇప్పుడు ఈ కేరళ కుట్టి మరో బిగ్గెస్ట్ ఆఫర్ తో వార్తల్లో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది.
చిరు ప్రతిష్టాత్మక మూవీ ‘కాకా’ ( Kaaka) లో ఓ పవర్ ఫుల్ అండ్ క్రూషియల్ రోల్ లో ఆమె కనిపించబోతోంది. ఈ రోజు ( సెప్టెంబర్ 8, 2026 ) అనశ్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ పోస్టర్‌లో అనశ్వర అమాయకత్వంతో కూడిన పద్ధతైన లుక్‌లో ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థినిగా దర్శనమిచ్చింది. ఆమె హోమ్లీ అప్పీరెన్స్ నెటిజన్లను, మెగా అభిమానులను ఒక్కసారిగా ఆకట్టుకుంది.
అంతేకాకుండా.. ఈ పోస్టర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో నీడలా కనిపిస్తున్న చిరంజీవి లుక్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సినిమాలో ఆమె పాత్రకు మెగాస్టార్ ఇచ్చే ప్రాధాన్యతను, వారి మధ్య ఉండే బలమైన భావోద్వేగ బంధాన్ని ఈ షాడో వర్క్ ప్రతిబింబిస్తోంది. ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో అనశ్వర, చిరంజీవి కుమార్తె ‘అమ్ములు’ అనే పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన సుదీర్ఘ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది.
►ALSO READ | Vishwanath & Sons OTT Release: ఓటీటీలోకి ‘విశ్వనాథ్ & సన్స్’ .. సూర్య మూవీ స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?
‘వాల్తేరు వీరయ్య’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మళ్ళీ రీపీట్ అవుతుండటంతో ‘కాకా’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘కాకా’ చిత్రాన్ని 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. మెగాస్టార్‌తో కలసి నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ అనశ్వర కెరీర్‌ను టాలీవుడ్‌లో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
Happy Birthday to the
‘HEART OF KAAKA’, Ammulu Paapa, #AnaswaraRajan 🤍#KAAKA Shoot in progress..
Worldwide Grand Release on January 13th, 2027 🔥 pic.twitter.com/BOCBm6kSZg— Kaaka (@KaakaMovie) September 8, 2026