Reading Time: < 1 minute
Prabhas Fauzi Post Production Vfx Shooting Update

Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 15 వరకు ‘ఫౌజీ’ షూటింగ్‌కు ప్రభాస్‌ బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో డార్లింగ్‌కి ఇంకా సుమారు 20 రోజుల వర్క్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయితే దాదాపు ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తి అవుతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం డార్లింగ్ ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినప్పటికీ పోస్ట్‌ప్రొడక్షన్ పనులకు మాత్రం ఎలాంటి విరామం ఇవ్వడం లేదట. ముఖ్యంగా సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ VFX సంస్థలు ఈ భారీ యాక్షన్ బ్లాక్స్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.