Reading Time: < 1 minute

పవన్ కేసరి ‘#ఎల్‌‌‌‌యుబీ’ మూవీ షూటింగ్ స్టార్ట్ 

Caption of Image.

పవన్ కేసరి, ప్రాముఖ్య జంటగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ ‘#ఎల్‌‌‌‌యుబీ’.  మణికంఠ పెదమల్లు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. రైటర్ బీవీఎస్ రవి క్లాప్ కొట్టగా, నిర్మాత చైతన్య రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.  ‘సంబరాల ఏటిగట్టు’  చిత్ర దర్శకుడు రోహిత్ కేపీ, దర్శకుడు సముద్ర, నిర్మాతలు లగడపాటి శ్రీనివాసరావు, శ్రీకాంత్ మూవీ టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.  

అభితేజ్, జెడివి ప్రసాద్, మల్లిక లెల్ల, సాయికిరణ్, ‘రోమాంచకం’ ఫేమ్ మధు,  భాను ప్రకాష్ కడియాల, మోత రాజేందర్  కీలక పాత్రలు పోషించనున్నారు. అక్షయ్ వసూరి డిఓపిగా పని చేస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ రోహిణి ఎడిటర్‌‌‌‌‌‌‌‌గా, సుధ శ్రీనివాస్ సంగీత దర్శకుడిగా,  జైలర్ 2, ఓజి ఫేమ్ శ్రీనివాస మౌళి లిరికల్ రైటర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.