Reading Time: < 1 minute

చాలాకాలం భార్యతో విడిగా ఉండటమంటే హింసించడమే ..విడాకులు తీసుకోవచ్చు: మద్రాస్ హైకోర్టు

Caption of Image.

భార్యాభర్తల విడాకుల విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భార్యను చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురి చేస్తే ఆమె విడాకులు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యకు చాలాకాలంగా వైవాహిక జీవితానికి దూరంగా ఉండటం హింసించడమే అని కోర్టు స్పష్టం చేసింది. హింసించడం, నిర్లక్ష్యం కారణాలతో భార్యకు విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సమర్ధించింది. 

తంజావూరు కు చెందిన ఓ ప్రభుత్వ టీచర్.. భార్యకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడాన్ని  సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ ,జస్టిస్ ఎం.డి. సుమతిలతో కూడిన మధురై కోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

కోర్టు విచారణ ప్రకారం..ప్రభుత్వ స్కూల్ హెడ్మాస్టర్, బీఎస్ ఎన్ ఎల్ లోఉద్యోగి గా ఉన్న మహిళ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా 29 ఏళ్లు కాపురం చేసిన తర్వాత విడాకులకోసం బాధితురాలు తంజావూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. భర్త సోదరుడు మరణించగా  అతని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేశాడని ఆరోపించింది. కోర్టులో సాక్ష్యాలను ప్రొడ్యూజ్  చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బాధితురాలికి విడాకులు మంజూరు చేసింది. 

ఇదిలా ఉండగా.. ఫ్యామిలీ కోర్టు తీర్పును  సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టు వెళ్లాడు ఆమె భర్త. మంగళవారం  ఈ కేసు విచారణకు రాగా  మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్..ఫ్యామిలీ కోర్టు బాధితురాలికి విడాకులు సరైనదే అని కోర్టు సివిల్ మిస్సెలెనియస్ అప్పీల్‌ను కొట్టివేసి, వివాహాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన డిక్రీని సమర్థించింది.

©️ VIL Media Pvt Ltd.