Reading Time: < 1 minute

బైక్ టాక్సీల విషయంలో కేంద్రం ప్రకటనపై బీటీఏ హర్షం

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు: ప్రైవేట్ టూవీలర్లను బైక్ టాక్సీలుగా నడుపుకునేందుకు అనుమతించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరడాన్ని బైక్ టాక్సీ అసోసియేషన్ (బీటీఏ) స్వాగతించింది. టూవీలర్ల వల్ల 8 కోట్ల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొనడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. అధికారిక ఉద్యోగాలు తక్కువగా ఉన్న గ్రామీణ , పాక్షిక పట్టణ ప్రాంతాల యువతకు ఇది గొప్ప ఉపాధి అవకాశమని అసోసియేషన్ తెలిపింది. బైక్ టాక్సీలు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆటంకం కావని, పేద కుటుంబాలకు జీవనాధారమని నాయకులు స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

©️ VIL Media Pvt Ltd.