
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన మార్క్ మాస్ యాటిట్యూడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘టాక్సీవాలా’ తర్వాత దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో విజయ్ దేవరకొండ చేస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘‘రణబాలి’. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా మాస్ యాక్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
19వ శతాబ్దం (1854 – 1878) నాటి బ్రిటిష్ క్రూరత్వానికి వ్యతిరేకంగా సాగే చారిత్రాత్మక రక్తాపాత పోరాటమే ఈ ‘రణబాలి’. మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో కరువు సమయంలో భారతీయ ధాన్యాన్ని దోచుకుంటూ, అమాయకులను నరికిచంపే ఆంగ్లేయుల క్రూరత్వానికి చెక్ పెట్టే వీరుడిగా విజయ్ దేవరకొండ ‘శింగనమల బొబ్బిలి రణబాలి’ పాత్రలో కనిపించనున్నారు. విజయ్ రఫ్ లుక్, మాస్ మేకోవర్, పోరాట ఘట్టాలలో ఆయన బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి.
అయితే ఇది ఏ ఒక్క వ్యక్తి జీవిత కథ కాదని, చరిత్రలో పెద్దగా ప్రస్తావనకు రాని ఘటనల ఆధారంగా కథను రూపొందించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న ‘జయమ్మ’ అనే సాంప్రదాయ, భావోద్వేగమైన పాత్రలో నటిస్తోంది. వీరి కాంబో మళ్లీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ రిపీట్ చేయబోతోంది.
ఇక ‘ది మమ్మీ’ ఫేమ్ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (ది మమ్మీ ఫేమ్) ఈ చిత్రంలో క్రూరమైన బ్రిటిష్ జనరల్‌గా ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో అలరించనున్నారు. అతడి ఎంట్రీ సినిమాకు మరింత అంతర్జాతీయ స్థాయి ఇమేజ్‌ను తీసుకొచ్చేలా ఉంది . మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ – అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని యాక్షన్ సీన్లను విపరీతంగా ఎలివేట్ చేసింది.
విజయ్ దేవరకొండ వైల్డ్ యాక్షన్, అద్భుతమైన నిర్మాణ విలువలు, కళ్ళు చెదిరే విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైలురాయిగా నిలవనుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి విందుగా మారనున్న ఈ భారీ పాన్ ఇండియా విజువల్ వండర్ దసరా కానుకగా అక్టోబర్ 16, 2026న థియేటర్లలోకి రాబోతోంది.