Reading Time: < 1 minute

పోలీస్ అవతార్‌లో సూర్య విశ్వరూపం.. ‘సీన్’ టైటిల్ టీజర్ చూస్తే గూస్‌బంప్సే!

Caption of Image.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ స్టార్ హీరో.. ఈ ఏడాది మూడో రిలీజ్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను టార్గెట్ చేయబోతున్నాడు. ‘ఆవేశం’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ యాక్షన్ డ్రామాకు ఎట్టకేలకు టైటిల్ ఖరారైంది. సూర్య 47గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సీన్’ (Scene) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదల చేసిన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్‌గా అదిరిపోయే స్టైలిష్ అవతార్‌లో దర్శనమిచ్చాడు. షార్ట్, టీషర్ట్‌లో రఫ్ అండ్ కూల్ లుక్‌లో కనిపించిన సూర్య.. జైలు ఖైదీల మధ్య నుంచి పోలీస్ ఆఫీసర్ భుజంపై చేయి వేసుకుని నడుచుకుంటూ వచ్చే సీన్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. టీజర్‌లో సూర్య బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ చూస్తుంటే.. సినిమాలో ఆయన పాత్ర ఏ రేంజ్‌లో ఉండబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది.

ఇక ‘సీన్’లో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సూర్య-నస్లెన్ కాంబినేషన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. యాక్షన్, కామెడీ, క్రైమ్ అంశాలను మిక్స్ చేస్తూ జీతూ మాధవన్ తనదైన నెరేషన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మలయాళ స్టార్ కంపోజర్ సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సూర్య, జీతూ మాధవన్, జఘరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న థియేటర్లలోకి తీసుకురానున్నారు. అదే రోజున ‘రామాయణ’తో బాక్సాఫీస్ క్లాష్ ఉండటంతో.. దీపావళి రేస్ మరింత ఆసక్తికరంగా మారింది.

 

©️ VIL Media Pvt Ltd.