Reading Time: < 1 minute

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది సైట్ సమస్యలతో కళ్లజోడు వాడాల్సి వస్తోంది. స్క్రీన్ టైమ్ పెరగడం, కళ్లు మసకబారడం వల్ల రోజూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే మన ఇంట్లోనే లభించే కొన్ని ప్రకృతిసిద్ధమైన విత్తనాలను డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా కంటి చూపును సహజంగా మెరుగుపరుచుకోవచ్చు. పాతకాలం నుంచి పాటిస్తున్న ఆ పవర్ ఫుల్ గింజలేంటో, వాటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అవిసె, గుమ్మడి గింజల శక్తి: కంటి చూపు మందగించడం, మసకబారడం వంటి సమస్యలను తగ్గించడంలో అవిసె గింజలు, గుమ్మడి గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక వీటిలో కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ ఒక టేబుల్ స్పూన్ చొప్పున వీటిని తీసుకుంటే కొద్ది రోజుల్లోనే కంటి చూపులో మంచి మార్పు కనిపిస్తుంది.

గుమ్మడి గింజలతో మెరుగైన దృష్టి: గుమ్మడి గింజల్లో జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి మసకను తగ్గించి, దృష్టిని స్పష్టంగా మార్చడానికి తోడ్పడతాయి. ఇక రోజువారీ ఆహారంలో వీటిని భాగం చేసుకోవడం వల్ల కళ్లకు అవసరమైన బలం లభించి, కంటి సంబంధిత సమస్యలకు సహజంగా చెక్ పెట్టవచ్చు.

Feeling Your Eyesight Getting Weak? Add These Foods to Your Diet
Feeling Your Eyesight Getting Weak? Add These Foods to Your Diet

ఎలా తీసుకోవాలి?: ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున తింటే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. ఇక నేరుగా తినడం కష్టంగా ఉంటే, వీటిని స్మూతీస్, సలాడ్స్ లేదా జ్యూస్‌లపై చల్లుకుని కూడా తీసుకోవచ్చు. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గా కంటికి మేలు చేస్తాయి.

కంటి చూపు తగ్గినప్పుడు ఏవేవో మందులు వాడి ఇబ్బంది పడేకంటే, పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఆహారపు అలవాట్లను పాటించడం ఎంతో మంచిది. రోజూ వీటిని క్రమం తప్పకుండా తింటే కళ్లజోడు అవసరం లేకుండానే కంటి ఆరోగ్యం భద్రంగా ఉంటుంది.

గమనిక: కంటి చూపులో తీవ్రమైన మార్పులు లేదా నొప్పి ఉన్నట్లయితే తప్పనిసరిగా కంటి వైద్యుడిని (ఆప్తామాలజిస్ట్) సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

The post కళ్ళు బలహీనంగా అనిపిస్తున్నాయా? ఈ ఆహారాలను డైట్‌లో చేర్చుకోండి! appeared first on Manalokam – Latest Telugu News & Updates.