Reading Time: 3 minutes
సెప్టెంబర్ 8 రాశిఫలాలు: మంగళకరమైన రోజు మంగళవారం మీ రాశి ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (సెప్టెంబర్ 8, 2026): ఈ రోజు 12 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి అంశాల్లో భిన్నమైన ఫలితాలు ఉండనున్నాయి. మేషం నుంచి మీనం వరకు కొందరికి ఆదాయం, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు కలిసిరాగా, మరికొందరు ఖర్చులు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వ్యాపారాలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్త వుతాయి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందు తాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. జీవిత భాగస్వామి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇతరత్రా కూడా కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఉద్యోగావకా శాలు లభిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. రుణ సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతల్లో మార్పు వస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో అదనపు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా కొన్ని శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడ తాయి. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. పెండింగ్ పనుల్ని కొద్ధి శ్రమతో పూర్తి చేస్తారు. ప్రయా ణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందు తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకా రాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు, సమస్యలు చాలావరకు చక్కబడతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విష యాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయం బాగానే ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూ లతలు పెరుగుతాయి. పని ఒత్తిడి కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. అవసర సమయాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ ఎక్కువగా ఉన్నా లాభాలకు లోటుండదు. మిత్రుల సహాయంతో పనులన్నీ పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. నిరుద్యో గులకు ఆశించిన ఉద్యోగం లభించవచ్చు. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. లాభాలకు ఢోకా ఉండదు. ముఖ్య మైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడ తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్ర త్తలు పాటించడం మంచిది. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో చిన్నా చితకా సమస్యలు తొలగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇష్టమైన బంధువులతో శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆదాయానికి లోటుండదు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పెద్దలతో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడి స్తారు. కుటుంబ విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. బంధువుల నుంచి సమస్యలుంటాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందు తుంది.