
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సుమంత్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో నా నుంచి వస్తున్న చాలా బిగ్ బడ్జెట్ సినిమా ఇది. నిర్మాతలు చాలా పెద్ద స్కేల్ లో తీశారు. అలాగే ప్రమోషన్స్ కూడా చాలా అగ్రెసివ్‌గా చేస్తున్నారు. హిందీ, తమిళ్‌లో కూడా రిలీజ్ అవుతుంది. నార్త్ నుంచి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.
కథ మొత్తం నాకు నచ్చింది. ఇంటర్వెల్ లో, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కి మంచి హై ఇస్తాయి. సంతోష్ ఈ కథని సింగిల్ సిట్టింగ్‌లో చెప్పారు. నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ సంతోష్‌కి వేదాలు, పురాణాల పట్ల చాలా మంచి అవగాహన ఉంది. తనకి ఇది చాలా రైట్ సబ్జెక్టు. తను అనుకున్న కథని అంతే అద్భుతంగా తీశాడు. మేము అనుకున్నప్పుడు ఇంత బిగ్ స్కేల్‌లో తీస్తారని అనుకోలేదు. కాకపోతే VFX పరంగా, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా, నటీనటుల పరంగా అన్నీ కలిసి వచ్చాయి.
అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్
నేను యూట్యూబ్ లో మూఢ నమ్మకాలను ఎక్స్‌పోజ్ చేసే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడే అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఇది డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. అలాగే మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సినిమాలో సిద్దు జొన్నలగడ్డ ఓ సీరియస్ క్యారెక్టర్ చేశాడు. మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది. అది సినిమాకే హైలెట్‌గా ఉంటుంది. చూసిన వాళ్లందరూ కూడా అది చాలా అద్భుతంగా వచ్చింది అని చెప్పారు. అది సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఈ పాత్ర ఒప్పుకున్నందుకు సిద్దుకి థాంక్స్. ‘కార్తికేయ’, ‘కాంతార’ నుంచి ఆ మైథాలజీ ట్రెండ్ మొదలైంది. అంతకు ముందు కూడా ఉంది. కాకపోతే ఈ చిత్రాలతో మళ్లీ వరుసగా అలాంటి సినిమాలు రావడం ప్రారంభమైంది. కానీ మేము ఈ కథని మూడేళ్ల క్రితమే ఫిక్స్ చేశాము. అప్పటికి సరైన నిర్మాతలు రాలేదు. ఒక సంవత్సరం తర్వాత మధు గారు, ఆ తర్వాత లక్ష్మణ్ గారు వచ్చారు. లక్ష్మణ్ గారు మా సినిమా ఫుటేజ్ చూసి ఆయనకు నచ్చి వచ్చారు. లక్ష్మణ్ గారు దిల్ రాజు గారితో చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన మా సినిమాలో భాగం కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.