Reading Time: < 1 minute
Suriya Scene Movie Title Release Date

Suriya: తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతున్న కొత్త మూవీకి టైటిల్, రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. మలయాళ దర్శకుడు జితు మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘సీన్’ (Scene) అనే టైటిల్‌ను మేకర్స్ పెట్టారు. ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్ నటిస్తుండగా.. నస్లెన్‌, ఆనంద్‌రాజ్‌, లాల్‌, రాజ్‌ ప్రియన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. నవంబర్ 6, 2026 న ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుందని అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక జితు మాధవన్ విషయానికి వస్తే.. ఆయన గతంలో ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి సక్సెస్‌ఫుల్ మలయాళ మూవీస్‌కి దర్శకత్వం వహించారు. ‘ఆవేశం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు సూర్యతో కలిసి తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. సూర్య, జితు మాధవన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సూర్యను భిన్నమైన పాత్రలో చూపించనున్నారనే వార్తలు మూవీపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సింగం, సింగం 2, సింగం 3 తర్వాత సూర్య నటిస్తున్న పోలీసు సినిమాగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.