
Navya Nanda: అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆమె ఫ్యాషన్ సెన్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అయితే ఈసారి నవ్య వేసుకున్న డ్రెస్‌లో అందం కంటే మరో ప్రత్యేకతే అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తగా డిజైనర్ డ్రెస్ కొనుక్కుని రావడం కాదు.. ఏకంగా తన తల్లి శ్వేతా బచ్చన్ 11 ఏళ్ల క్రితం వేసుకున్న అదే గోల్డెన్ మినీ డ్రెస్‌ను మళ్లీ ధరించి ఈవెంట్‌కు వచ్చింది. దీంతో తల్లి అప్పటి లుక్, కూతురు ఇప్పటి లుక్ రెండూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా ఫ్యాషన్ ఇండస్ట్రీలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్, ఫ్యాషన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పార్టీలో నవ్య నవేలి నందా మెరిసిపోయింది. ఆమె వేసుకున్న భారీగా ఎంబెలిష్ చేసిన గోల్డెన్ మినీ డ్రెస్ ప్రత్యేకంగా నిలిచింది.
అయితే ఈ డ్రెస్ నవ్య కోసం తాజాగా తయారు చేయించినది కాదు. 2015లో అబు జానీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన ఇదే డ్రెస్‌ను శ్వేతా బచ్చన్ BMW ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ధరించారు. అప్పట్లో శ్వేతా బోల్డ్ రెడ్ లిప్‌స్టిక్, గోల్డెన్ బ్రాస్‌లెట్, బ్లాక్ హీల్స్‌తో ఈ లుక్‌ను మరింత గ్లామరస్‌గా మార్చారు. ఇప్పుడు అదే డ్రెస్‌ను నవ్య మరోసారి బయటకు తీసి తనదైన స్టైల్‌లో ప్రెజెంట్ చేసింది. శ్వేతా అప్పట్లో ఇచ్చిన లుక్‌తో పోలిస్తే నవ్య స్టైలింగ్ చాలా సింపుల్‌గా ఉంది. మినిమల్ మేకప్, సింపుల్ హెయిర్‌స్టైల్‌తో పాటు గోల్డ్ ఎంబెలిష్డ్ పంప్స్‌ను జత చేసింది. దీంతో భారీగా కనిపించే డ్రెస్ కూడా ఆమెపై చాలా ఎలిగెంట్‌గా, మోడ్రన్‌గా కనిపించింది.
ఈ డ్రెస్‌లో బాడీస్, స్కర్ట్‌పై సర్క్యులర్, స్కాలోప్‌డ్ ఎంబెలిష్‌మెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. గోల్డ్ డీటెయిలింగ్, సీక్విన్స్, బీడ్స్‌తో చేసిన వర్క్ కారణంగా డ్రెస్‌కు చాలా రిచ్ లుక్ వచ్చింది. నవ్య మాత్రం మిగతా యాక్సెసరీస్ విషయంలో వెనక్కి తగ్గి, డ్రెస్ అందాన్ని మాత్రమే హైలైట్ చేసింది. ఇక ఈ లుక్‌లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. 2015లో శ్వేతా ఈ డ్రెస్ ధరించినప్పుడు నవ్య కూడా చిన్న వయసులో ఆ ఫ్యాషన్ షోకు హాజరైందని రిపోర్టులు చెబుతున్నాయి. అప్పుడు తన అమ్మమ్మ జయా బచ్చన్‌తో కలిసి ఫ్రంట్ రోలో కూర్చున్న నవ్య, ఇప్పుడు అదే డిజైనర్ల 40వ వార్షికోత్సవ వేడుకకు తన తల్లి డ్రెస్‌లో రావడం ప్రత్యేకమైన ఫ్యాషన్ మూమెంట్‌గా మారింది.
ఈ వేడుకలో నవ్యా నందా ధరించిన మెరిసే గోల్డెన్ మినీ డ్రస్ చూసి, సోషల్ మీడియాలో భారతదేశంలోని 80 శాతం బంగారాన్ని నవ్యా ఒక్క డ్రస్‌లోనే వేసుకుందని నెటిజన్లు రకరకాల జోకులు, మీమ్స్ ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో దేశంలోనే అత్యంత ధనవంతులైన అంబానీ కుటుంబానికి చెందిన నితా అంబానీ కూడా అక్కడే ఉండటంతో.. ఆ గోల్డ్ డ్రస్ చూసి నితా అంబానీ షాక్ అయ్యారు, దాని గురించి ఆరా తీశారు అంటూ సోషల్ మీడియాలో రక రకాల కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఈ డ్రెస్ విలువ కోట్ల రూపాయలు ఉంటుందంటూ కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, దాని ఖచ్చితమైన ధర ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. అయితే డ్రెస్ ధర కంటే 11 ఏళ్ల తర్వాత తల్లి ధరించిన దుస్తులను కూతురు మళ్లీ ధరించడం, దానికి తనదైన మోడ్రన్ టచ్ ఇవ్వడం ఇప్పుడు ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్‌లో ట్రెండ్స్ మారినా.. కొన్ని లుక్స్ మాత్రం తరాలు మారినా ప్రత్యేకంగానే నిలుస్తాయని నవ్య నందా మరోసారి చూపించింది.