ఉల్లి కారం ఆంధ్రాలో ఎంతో ఫేమస్. ఈ రెసిపీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ, పచ్చి కారంతో చేస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దీనిని చాలామంది రోటిల్లోకి తింటారు. అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారి విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఉల్లి కారానికి కావాల్సిన పదార్దాలు : 3 వెల్లుల్లి రెబ్బలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, పచ్చి కారానికి 15 ఎండు మిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినప్పప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం , ఒక టీ స్పూన్ ఆవాలు , 5 కరివేపాకు ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ ఆయిల్ ను తీసుకోవాలి. అయితే, కొంచం ఎక్కువ కారంతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది.
ఉల్లి కారం తయారి విధానం : ముందుగా గ్యాస్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి, దానిలో నూనె వేసి కొద్దిగా పచ్చిపప్పు, అర టీ స్పూన్ మినప్పప్పును కూడా వేసి బంగారు కలర్లోకి వచ్చే దాకా వీటిని బాగా వేయించుకోవాలి. దీనిని సరైన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.
ఉల్లి కారం తయారి విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండు మిర్చి కూడా వేసి దీనిని మీడియం మంటపై వేయించుకోవాలి. అలాగే, దీనిలో మూడు కరివేపాకు ఆకులు కూడా వేసి కరకరలాడే వరకు వీటిని బాగా వేయించుకోవాలి.
ఉల్లి కారం తయారి విధానం స్టెప్ 2 : ఇవి కొంచం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని వేసి క పొడిలాగా చేసుకోవాలి చేసుకోండి. ఇక ఇప్పుడు మూడు ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలాగే దంచితే అప్పుడే రుచిగా ఉంటుంది. చివర్లో దీనిని తాలింపు పెట్టుకుని తినడమే.




