
కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేవారి వయోపరిమితిని మరోసారి పెంచింది. ఇప్పటికే 7ఏళ్లు వయోసడలింపు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మరో మూడేళ్లు వయోపరిమితిని సడలించింది.దీంతో కానిస్టేబుల్ అభ్యర్థులకు మొత్తం 10ఏళ్ల వయోపరిమితి సడలింపు లభించింది. వయసు అనర్హత కారణంగా పోలీసు ఉద్యోగానికి అప్లయ్ చేసుకోని వారికి ఇది పెద్ద ఊరట.
పోలీస్, ఫైర్, జైళ్లు, SPF లోని కానిస్టేబుల్ పోస్టులకు ఈ వయోపరిమితి వర్తించనుంది. పోలీస్ శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు ఇది వర్తించదు. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియమకాలకు వర్తింపజేస్తూ బుధవారం (సెప్టెంబర్ 9) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్వర్తులు జారీ చేశారు.