
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సైబరాబాద్ ముఇన్సిపల్ కార్పొరేషన్. ఇకపై FSSAI లైసెన్స్ ఉన్న హోటళ్లనే ఆన్‌బోర్డ్ చేయాలని ఆదేశించింది. సిఎంసీ ట్రేడ్ లైసెన్స్ ఉన్న సంస్థలకే అనుమతి ఇవ్వాలని.. లైసెన్స్ గడువు ముగిసిన హోటళ్లను వెంటనే డీలిస్ట్ చేయాలని తెలిపింది. సస్పెండ్, రద్దైన ఫుడ్ బిజినెస్ లను ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాలని.. ఫుడ్ రేటింగ్, హైజీన్ రేటింగ్ విధానంపై వివరాలు ఇవ్వాలని పేర్కొంది.
ఆన్ లైన్లో కస్టమర్ రివ్యూలను తొలగించడం, మార్చడం చేయరాదని.. నోడల్ అధికారిని నియమించాలని స్విగ్గీ, జొమాటోకు ఆదేశించింది సీఎంసీ. సిఎంసీతో ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని.. ప్రతి ఫుడ్ అవుట్‌లెట్ సరైన జియో-లోకేషన్‌ను నమోదు చేయాలని తెలిపింది. నమోదైన ప్రాంగణం నుంచే ఆహారం తయారీ, డిస్పాచ్ జరగాలని.. ప్రతి ఫుడ్ అవుట్‌లెట్‌లో సిఎంసీ ట్రేడ్ లైసెన్స్ ప్రదర్శన తప్పనిసరి అని పేర్కొంది.
లైసెన్స్‌లను ఎప్పటికప్పుడు ధృవీకరించాలని… వారం రోజుల్లో కంప్లయన్స్ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సిఎంసీ పరిధిలోని అన్ని ఆన్‌బోర్డ్ ఫుడ్ సంస్థల జాబితా ఇవ్వాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది సీఎంసీ. నిబంధనలు ఉల్లంఘిస్తే ఫుడ్ సేఫ్టీ చట్టం, జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపింది సీఎంసీ.