
డీఆర్‌డీఓకు చెందిన కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ డెవలప్‌మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ సెంటర్ (సీఏఎస్ డీఐసీ డీఆర్డీఓ)పెయిడ్ ఇంటర్న్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 30.
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ 12, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 13, మెకానికల్ ఇంజినీరింగ్ 4.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఇప్పటివరకు ఉన్న అన్ని సెమిస్టర్లలో కలిపి కనీసం 7.5 సీజీపీఏ సాధించి ఉండాలి.
ALSO READ : CSIR ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు .. డైరక్ట్ ఇంటర్వ్యూ..రాత పరీక్ష లేదు.. వివరాలు ఇవే..!
వయసు: 25 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 11.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ drdo.gov.inను సందర్శించండి.