Reading Time: < 1 minute

యూపీఐ చార్జీలతో ఏటా రూ.27 వేల కోట్లు..బ్యాంకులకు భారీ ఆదాయం

Caption of Image.

న్యూఢిల్లీ: యూపీఐ ట్రాన్సాక్షన్లపై వచ్చే నెల 15 నుంచి వసూలు చేసే  మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌‌‌‌)తో బ్యాంకులకు భారీగా ఆదాయం వస్తుందని గ్లోబల్ రీసెర్చ్ సంస్థ బెర్న్‌‌స్టీన్ పేర్కొంది.   

2027–2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఏటా రూ.27 వేల కోట్ల (2.8 బిలియన్ డాలర్ల) అదనపు ఆదాయం సమకూరనుందని  వెల్లడించింది. మొత్తం పేమెంట్ ఎకోసిస్టమ్‌‌కు వచ్చే  ఈ ఆదాయంలో దాదాపు  60 శాతం బ్యాంకులకే దక్కనుంది.   

పెద్దమొత్తంలో సేవింగ్స్ ఖాతాలు కలిగిన ఎస్‌‌బీఐకి ఎక్కువ రెవెన్యూ అందుతుంది.  బ్యాంకులకు వచ్చే వాటాలో  దాదాపు 25శాతం ఈ ఒక్క బ్యాంకే  దక్కించుకోనుంది. పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లుగా ఉన్న యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్ సైతం భారీగా ప్రయోజనం పొందనున్నాయని బెర్న్​స్టీన్​ తెలిపింది. 

©️ VIL Media Pvt Ltd.