
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు వివిధ కేటగిరీలకు చెందిన పారా డికల్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 రకాల పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 15న ప్రారంభం కాగా, అక్టోబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 590.
పోస్టు పేరు: నర్సింగ్ సూపరింటెండెంట్
ఖాళీలు: 365.
విద్యార్హత: రిజిస్టర్డ్ నర్స్, మిడ్‌వైఫ్ సర్టిఫికెట్ (ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో మూడేళ్ల కోర్సు) లేదా బి.ఎస్సీ నర్సింగ్ అర్హత కలిగి ఉండాలి.
పోస్టు పేరు: డయాలసిస్ టెక్నీషియన్.
ఖాళీలు: 1.
విద్యార్హత: బి.ఎస్సీ డిగ్రీతోపాటు హేమోడయాలసిస్ లో డిప్లొమా కలిగి ఉండాలి. లేదా హేమోడయాలసిస్ విభాగంలో రెండేళ్ల అనుభవం/ సమాన ట్రైనింగ్ తప్పనిసరి. డయాలసిస్ టెక్నిక్స్/ టెక్నాలజీ లేదా రెనల్ డయాలసిస్ టెక్నాలజీలో బి.ఎస్సీ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: హెల్త్ & మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్ II
ఖాళీలు: 43.
విద్యార్హత: కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్‌గా బి.ఎస్సీ డిగ్రీతోపాటు హెల్త్/ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లో ఏడాది డిప్లొమా కలిగి ఉండాలి.లేదా ఎన్‌సీవీటీ గుర్తింపుతో హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లో ఏడాది ఎన్‌టీసీ సర్టిఫికెట్ అర్హత కలిగి ఉండాలి.
పోస్టు పేరు: ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్.
ఖాళీలు: 1.
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (బీఏఎస్ఎల్ పీ)డిగ్రీ పూర్తి చేసి, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వద్ద రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
పోస్టు పేరు: ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్).
ఖాళీలు: 118.
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ (అలోపతి) లేదా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మ్.డి) పూర్తి చేసి ఉండాలి. అలాగే, 1948 ఫార్మసీ చట్టం ప్రకారం ఫార్మసిస్ట్‌గా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
పోస్టు పేరు: రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్.
ఖాళీలు: 25.
విద్యార్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి రేడియోగ్రఫీ/ ఎక్స్-రే టెక్నీషియన్/ రేడియోడయాగ్నోసిస్ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. ఇదే డిప్లొమా కలిగిన సైన్స్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే, రేడియోగ్రఫీ/ ఇమేజింగ్ టెక్నాలజీలో సమానమైన బి.ఎస్సీ అర్హత ఉన్నవారు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు).
పోస్టు పేరు: ఈసీజీ టెక్నీషియన్.
ఖాళీలు: 4.
విద్యార్హత: ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా సైన్స్ విభాగంలో డిగ్రీతోపాటు ఈసీజీ ల్యాబొరేటరీ టెక్నాలజీ/ కార్డియాలజీ/ కార్డియాలజీ టెక్నీషియన్/ టెక్నిక్స్‌లో కనీసం ఏడాది వ్యవధి గల సర్టిఫికెట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
పోస్టు పేరు: ఆప్టోమెట్రిస్ట్. ఖాళీలు: 2.
విద్యార్హత: ఆప్టోమెట్రీలో బి.ఎస్సీ లేదా ఆప్తాల్మిక్ టెక్నీషియన్‌లో 3 నుంచి 4 ఏళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసి ఉండాలి. అలాగే, సంబంధిత కౌన్సిల్ లేదా లైసెన్సింగ్ బాడీ వద్ద రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. సంబంధిత కౌన్సిల్ లేదా బోర్డులో రిజిస్ట్రేషన్ కలిగి ఉండటం తప్పనిసరి.
పోస్టు పేరు: లాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II.
ఖాళీలు: 31.
విద్యార్హత: సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసి, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా (డీఎంఎల్ టీ) లేదా కనీసం ఏడాది ఫుల్ టైమ్ వ్యవధి గల సమాన సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.
వయసు: 2027, జనవరి 1 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 15.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈబీసీలకు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.250, జనరల్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 14.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్చ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ rrb.indianrailways.gov.inను సందర్శించండి.
కంప్యూటర్ బేస్ట్ టెస్ట్
ఆన్ లైన్ విధానంలో జరిగే ఎగ్జామ్ లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి 70 ప్రశ్నలు 70 మార్కులకు, జనరల్ అవేర్ నెస్ నుంచి10 ప్రశ్నలు 10 మార్కులకు, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకు, జనరల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు 10 మార్కులకు ఇస్తారు.
నెగెటివ్ మార్కింగ్ విధానం ఉన్నది. ప్రతి తప్పు సమాధానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. సబ్జెక్టు లేదా సెక్షన్ల వారీగా ప్రశ్నల విభజన అనేది ప్రాథమిక అంచనా మాత్రమే. ఇందులో మార్పులు ఉండే అవకాశం ఉంది.
కనీసఅర్హత మార్కులు: అన్ రిజర్వ్ డ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ 30 శాతం, ఎస్సీ 30 శాతం, ఎస్టీ 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.