
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరును, ఆ పార్టీ గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేసింది. పార్టీలో రెండు వర్గాలు పార్టీ తమదంటే తమదని క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితుల్లో.. పార్టీ పేరు, గుర్తు ప్రస్తుతానికి ఎవరికీ చెందకుండా ఈసీ ఫ్రీజ్ చేసింది. అక్టోబర్ 6న ఉపఎన్నికలు ఉన్న క్రమంలో.. పార్టీ పేరు, గుర్తులపై ఎవరూ పోటీ చేయకుండా ఆదేశాలిచ్చింది.
దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా కొత్త పేరు, గుర్తును ఎన్నికల సంఘానికి సమర్పించింది మాజీ సీఎం మమతా బెనర్జీ వర్గం. 2026 సెప్టెంబర్ 18వ తేదీన 11.36 గంటలకు ముందు కొత్త పేరు, సింబల్ ను ఈసీకి సమర్పించింది.
పార్టీ పేరు, గుర్తుపై వివాదం నెలకొన్న సందర్భంగా వచ్చే ఉపఎన్నికల్లో ఆ పేరు, గర్తులతో పోటీ చేయడం కుదరదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ప్రత్యామ్నాయ పేర్లు, గుర్తులను సమర్పించాల్సిందిగా సూచించింది. రానున్న రెండు ఉప ఎన్నికలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.
28 ఏళ్లుగా మమతాబెర్జీకి సెంటిమెంటుగా వస్తున్న పువ్వులు, గడ్డీతో కూడిన గుర్తు లేటెస్టుగా ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి తాత్కాలికంగా దూరమైంది. 1998 తర్వాత తొలిసారి మమతాబెనర్జీ పార్టీ నేతలు ఆ గుర్తు లేకుండా పోటీ చేయాల్సి వస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలకతో పార్టీ సంక్షోభానికి గురైన విషయం తెలిసిందే. 2026 జూన్ లో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రీతాబ్రతా బెనర్జీని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా 58 ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంతో వివాదం మొదలైంది. మమతా క్యాంప్ నేత సొవందేబ్ ఛటోపాద్యాయను ప్రతిపక్ష నేతగా వ్యతిరేకిస్తు రితాబ్రతాను ఎన్నుకున్నారు. దీనికి అసెంబ్లీ స్పీకర్ ఆమోదం లభించడంతో 28 ఏళ్ల తర్వాత తొలిసారి టీఎంసీ చీలికకు గురికావాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజుల్లోనే 20 ఎంపీలు కకోలీ ఘోష్ ఆధ్వర్యంలో ఎన్డీఏకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో లోక్ సభలోనే మమతా వర్గానికి బలం తగ్గిపోయింది.