Reading Time: < 1 minute
Zombie Reddy 2 First Look Upendras Powerful Poster Raises Expectations

Zombie Reddy 2: తేజ సజ్జ కెరీర్‌లో ‘హనుమాన్’కు ముందు వచ్చిన ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) ఎంత ప్రత్యేకమైన సినిమానో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ జాంబీ కామెడీకి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2’ (Zombie Reddy 2) నుండి ఈ రోజు (2026 సెప్టెంబర్ 18) కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయన పవర్‌ఫుల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హై-స్టేక్స్ యాక్షన్-కామెడీ చిత్రంలో ఉపేంద్ర ఒక సరికొత్త వైవిధ్యమైన, మాస్ అండ్ మ్యాడ్‌నెస్ కలగలిసిన పవర్‌హౌస్ పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. మొదటి భాగం రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగగా, ఈ భారీ సీక్వెల్ కథ మాత్రం పూర్తిస్థాయిలో హైదరాబాద్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో (చార్మినార్ వంటి ఐకానిక్ లొకేషన్లలో) సాగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ షనాయా కపూర్ టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమవుతుండగా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దీనికి కథ, స్క్రీన్‌ప్లే అందించగా, గౌర హరి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, నేపాలీ, జపనీస్ వంటి భాషల్లో 2027 లో భారీ స్థాయిలో విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తేజ సజ్జ పాత్ర, ఉపేంద్ర రోల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా రివీల్ చేయలేదు. దీంతో ఒక్కో అప్డేట్‌తో ‘జాంబీ రెడ్డి 2’పై క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. మరి తేజ సజ్జ, ఉపేంద్ర కాంబినేషన్‌లో ఈ సీక్వెల్ ఎలాంటి జాంబీ ప్రపంచాన్ని చూపించబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.