
ములుగు జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. జిల్లాలోని గోవిందరావుపేట తహసీల్దార్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఎమ్మార్వో సృజన్ కుమార్. శుక్రవారం ( సెప్టెంబర్ 18 ) ఏసీబీ అధికారులు నిర్వహించిన ఈ తనిఖీలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…
గోవిందరావుపేట తహసీల్దార్ ఆఫీసులో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ దాడుల్లో 14వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు తహసీల్దార్ సృజన్ కుమార్. తండ్రి కొడుకుల మధ్య భూ వివాదం పరిష్కరించడానికి రూ.14 వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించారు బాధితులు.
ALSO READ : కల్వకుంట్ల కుటుంబ దోపిడీ, అరాచకాలను బయటపెడతాం
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆఫీసులో లంచం తీసుకుంటుండగా సృజన్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సృజన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు ఏసీబీ అధికారులు.