Reading Time: 2 minutes
Personal Finance: ఇది కదా అసలైన స్కీమ్‌.. ప్రతి 3 నెలలకు మీ ఖాతాలో రూ. 57,400 జమ..!

Personal Finance: పదవీ విరమణ తర్వాత ఎలాంటి రిస్క్‌లు తీసుకోకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు ఆర్థిక స్థోమత ఉండటం అత్యవసరం. అరవై ఏళ్ల వయసు తర్వాత సురక్షితమైన, స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే అటువంటి వారికి, పోస్ట్ ఆఫీస్ వారి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఉత్తమమైన ఆప్షన్‌. కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చే ఈ పథకంలో మీరు జాయింట్ ఖాతా ద్వారా డబ్బు జమ చేస్తే, ప్రతి మూడు నెలలకు మీ ఖాతాలో రూ. 57,400 జమ చేస్తారు.

ఇది కూడా చదవండి: Flipkart: మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకు భారీ గుడ్‌న్యూస్‌..!

సీనియర్ సిటిజన్ల పొదుపు పథకం:

వయోవృద్ధుల పొదుపు పథకం అనేది వయోవృద్ధుల కోసం పోస్టాఫీసు అమలు చేసిన ఒక స్కీమ్‌. ప్రధానంగా 60 ఏళ్లు నిండిన వయోవృద్ధులు ఈ ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకం సంవత్సరానికి 8.2% మంచి వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం ప్రాథమిక కాలపరిమితి 5 సంవత్సరాలు. ఆ తర్వాత కోరుకుంటే కాలపరిమితిని మరో 3 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన మొత్తం సెక్షన్ 80C కింద ఆదాయపు పన్ను మినహాయింపుకు అర్హమైనది. ఈ పథకం జాయింట్ ఖాతాను తెరిచే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.

ప్రతి 3 నెలలకు రూ. 57,400

భార్యాభర్తలు కలిసి ఒక ఉమ్మడి ఖాతాలో గరిష్ట పరిమితి అయిన రూ. 28 లక్షలు జమ చేస్తే, వారికి 8.2% వడ్డీ రేటుతో ప్రతి మూడు నెలలకు రూ. 57,400 లభిస్తాయి. అంటే, వారిద్దరూ నెలకు సగటున ఒక్కొక్కరికీ రూ. 19,100 ఆదాయం పొందుతారు.

5 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన తర్వాత పెట్టుబడి పెట్టిన రూ. 28 లక్షలు పూర్తిగా రిటర్స్‌ వస్తాయి. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ప్రజాదరణ పొందింది. ఎందుకంటే ఇది బ్యాంక్ ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంది. ఈ పథకంలో ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి పెట్టిన మొత్తం 80C మినహాయింపుకు అర్హమైనప్పటికీ, అందుకున్న వడ్డీ ఆదాయం మీ ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను పరిధిలోకి వస్తుంది.

ఇది కూడా చదవండి: Driving License: వాహనదారులకు హెచ్చరిక.. సెప్టెంబర్ 25లోగా ఈ పనిచేయకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు!

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దేనిలోనైనా పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది. ఎందుకంటే నిబంధనలు అప్పుడప్పుడు మారుతుంటాయి. మీరు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: Edible Oil: పండుగ సీజన్‌కు ముందు పెద్ద ఊరట! వంట నూనె ధరలు తగ్గనున్నాయా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి