July 14, 2026

భారతీయుల స్నాక్స్ అలవాటు మారుతోంది… ఎక్కువగా ఇవే తింటున్నారు…!

భారతీయుల స్నాక్స్ అలవాటు మారుతోంది... ఎక్కువగా ఇవే తింటున్నారు...!
Reading Time: 2 minutes

భారతీయుల స్నాక్స్ అలవాటు మారుతోంది… ఎక్కువగా ఇవే తింటున్నారు…!

Caption of Image.

ఒకప్పుడు స్నాక్స్ అంటే… ఇంట్లో చేసిన పిండి వంటలు, స్వీట్స్ వగైరా ఉండేవి. కానీ.. ఇప్పుడు గ్లోబలైజేషన్ పుణ్యమా అని… అనవసరమైన జంక్ ఫుడ్ అంతా స్నాక్స్ లిస్ట్ లో చేరింది. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమాత్రం లాభం లేకపోగా… ఆరోగ్యానికి తీవ్ర నష్టం అని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్ విషయంలో అవగాహన పెరుగుతోంది. క్రమంగా జంక్ ఫుడ్ ని దూరం పెడుతున్నారు…స్నాక్స్ అయినా సరే, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం వైపే మొగ్గు చూపుతున్నారు జనం. ఇటీవల వెల్లడైన ఇండియా హెల్తీ స్నాకింగ్ సర్వే కూడా ఇదే చెబుతోంది.

ఫార్మ్లీ, ఇండియా హెల్తీ స్నాకింగ్ సమ్మిట్ (IHSS) విడుదల చేసిన ఇండియా హెల్తీ స్నాకింగ్ సర్వే (IHSS) 2026లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 6 వేల మందికి పైగా పాల్గొన్న ఈ సర్వే.. మెట్రో నగరాలతో పాటు టైర్ 1, టైర్ 2, టైర్ 3+ నగరాల్లోని కార్పొరేట్ ఆఫీసులు, కాలేజీలలో నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న 86 శాతం మంది స్నాక్స్ విషయంలో బ్రాండ్స్ పై నమ్మకంతో కొంటున్నామని తెలిపారు.అంతే కాకుండా తాము తీసుకునే ప్రాడక్ట్స్ లో ఏమేమి ఉన్నాయో లేబుల్స్ చూసి కొంటున్నట్లు తెలిపారు.

►ALSO READ | Health tips: కంప్యూటర్/ఫోన్ చూసి చూసి కళ్లు అలసిపోతున్నాయా? ఇలా మీ కళ్లని రిలాక్స్ చేయండి !

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం, పీరియడ్ ఫ్రెండ్లీ ఆహారం స్నాక్స్ గా తీసుకుంటున్నామని తెలిపారు సర్వేలో పాల్గొన్న 52 శాతం మంది మహిళలు. రోగనిరోధక శక్తి, ప్రోటీన్, బరువు నియంత్రించే ఆహారాలతో పాటు పీరియడ్ ఫ్రెండ్లీ ఆహారం తీసుకుంటున్నామని తెలిపారు.

62 శాతం మంది తాము తీసుకునే స్నాక్స్ లో ప్రోటీన్ కచ్చితంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నామని తెలిపారు. అంతే కాకుండా షుగర్ కంటెంట్ కి దూరంగా ఉంటున్నామని.. న్యాచురల్ స్వీటెనర్స్ ఉన్నవి తీసుకుంటున్నామని తెలిపారు మహిళలు.

దాదాపు 61% మంది బెల్లం లేదా ఖర్జూరాలతో తీపి చేసిన స్నాక్స్‌ను ఇష్టపడతామని చెప్పగా, కేవలం 13శాతం మంది మాత్రమే స్టీవియా, మాంక్ ఫ్రూట్ వంటి జీరో కేలరీ స్వీటెనర్లకు మొగ్గు చూపినట్లు తెలిపింది. అదే సమయంలో, 33శాతం మంది రిఫైన్డ్ షుగర్స్ కి దూరంగా ఉంటున్నామని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.