
లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్‌పరిధిలోని జల్ది పల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శేఖర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. జల్దిపల్లి బీట్పరిధిలో అడవుల నరికివేత, అటవీ భూములు ఆక్రమణలు జరుగుతున్నా శేఖర్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ సీరియస్‌గా పరిగణించారు. దీంతో శేఖర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్అధికారి రమేశ్ గురువారం తెలిపారు.
17 రోజుల్లో ముగ్గిరి సస్పెన్షన్
ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్‌పరిధిలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు అటవీ సిబ్బంది 17 రోజుల వ్యవధిలో సస్పెండ్ కావడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. యంత్రాలతో చెట్ల నరికివేత, ట్రాక్టర్లతో అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న డీఎఫ్ వో.. 17 రోజుల వ్యవధిలో శెట్పల్లి బీట్ఆఫీసర్ శ్యాంసుందర్, జల్దిపల్లి బీట్ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి, బొల్లారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విక్కీమార్టిన్పై సస్పెన్షన్ వేటు వేశారు.