Reading Time: < 1 minute
Dada Has Set The Target The Acting Lion Is Arriving

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం దాదా (DADA). ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ సరికొత్త పవర్‌ఫుల్ పాత్రలో అలరించనున్నారు.

బాలయ్య గాయం కారణంగా షూటింగ్ కు గతకొంతకాలంగా బ్రేక్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల తిరిగి షూటింగ్ ను స్టార్ట్ చేసి బాలయ్య లేని సీన్స్ ను తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి కేవలం 20 నుంచి 25 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది అనుకున్న షెడ్యూల్ ప్రకారం అన్ని పనులను పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ 24న ‘దాదా’ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై సతీష్ కిలారు ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువల తో నిర్మిస్తున్నారు.