
వీధికుక్కల దాడులు రోజురోజుకూ ఆందోళన కలిగిస్తున్నాయి. వీధికుక్కలే కాదు పెంపుడు కుక్కులు కూడా భయానక దాడులు చేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు, మహిళలపై పెంపుడు, వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు, ప్రాణాపాయం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా హర్యానాలో చిన్నారిపై జరిగిన దాడి మరోసారి కుక్కల నియంత్రణ, యజమానుల బాధ్యత, ప్రజల భద్రతపై చర్చకు తెరతీసింది.
సెప్టెంబర్ 14న హర్యానాలోని సోనిపట్ సిక్కా కాలనీలో హృదయవిదారక ఘటన జరిగింది. తన చిన్న మేనల్లుడిని ఎత్తుకుని నడుస్తున్న యువతిపై పెంపుడు కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క ఆమెను కిందపడేసి, చిన్నారిని లాక్కొని ముఖం, పొత్తికడుపుపై తీవ్రంగా కరిచింది.
మహిళ ఎంత ప్రయత్నించినా కుక్క చిన్నారిని వదలకపోవడంతో, స్థానికులు పరుగెత్తుకొచ్చి కష్టపడి కుక్కను తరిమి బాలుడిని రక్షించారు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని రోహ్‌టక్‌లోని PGIMS ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో కుక్క యజమాని సమీపంలో ఉన్నప్పటికీ వెంటనే సహాయానికి పరుగెత్తలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనతో ప్రమాదకర జాతి కుక్కలపై నిషేధం విధించాలని, పెంపుడు జంతువుల యజమానులకు నిబందనలు పెట్టాలని , ప్రజల భద్రత కోసం మరింత కఠినమైన పెట్ రూల్స్ అమలు చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Pitbull pet attacks 6 month old kid in Sonipat Haryana.
Check how relaxed is the Pitbull owner, sorry parent, while the dog was brutally attacking the kid.
Kid is severely injured, in hospital.
But Dog Lovers will still defend it. Justify it by saying dog must be hungry,… pic.twitter.com/K2LSXf8tUK
— Ankur Singh (@AnkurSingh) September 17, 2026