Reading Time: 2 minutes
Ott Releases September 18 You And Me Minerva Academy And The Scandal

OTT Releases: ఈ రోజు (సెప్టెంబర్ 18) ఓటీటీ వేదికలలో హాలీవుడ్, కొరియన్ కంటెంట్‌కు సంబంధించి రొమాంటిక్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌లతో వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఫ్రెంచ్ యంగ్ అడల్ట్ నవల ఆధారంగా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా నుంచి, జోసన్ రాజవంశం నేపథ్యంలో సాగే కొరియన్ కంటెంట్ వరకు ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అందుబాటులోకి వచ్చాయి. మరి వాటి వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి.

యు + మీ: ఎగైనెస్ట్ ది వరల్డ్ (You + Me: Against the World)

ఈ యంగ్ అడల్ట్ రోమాంటిక్ డ్రామా మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ రోజు (సెప్టెంబర్ 18) నుంచి అందుబాటులోకి వస్తోంది. ఎంజీన్ గోసెల్, బ్లేజ్ డి గ్రాండ్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్రెంచ్ యంగ్ అడల్ట్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ కథ, సమాజం నుండి, తమ కుటుంబాల నుండి అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటూ తమ ప్రేమను ఎలా నిలుపుకున్నారనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది.  ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

మినెర్వా అకాడమీ (Minerva Academy)

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ టీన్ మిస్టరీ డ్రామాలో విక్టర్ నోటో, కెరాల్ అలెక్సిస్ ముఖ్య పాత్రలు పోషించారు. అత్యంత కఠినమైన రూల్స్ ఉండే ఒక ప్రైవేట్ మిలిటరీ బోర్డింగ్ స్కూల్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. స్కూల్ లోపల అనుమానాస్పదంగా జరిగే ఒక సంఘటన, దాని వెనుక ఉన్న రహస్యాలను అక్కడి విద్యార్థులు ఎలా బయటకు తీశారో ఈ థ్రిల్లర్‌లో చూపించారు.

మాన్‌స్ట‌ర్: ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ (Monster: The Lizzie Borden Story)

నెట్‌ఫ్లిక్స్ వేదికగా వస్తున్న ఈ ట్రూ క్రైమ్ డ్రామాలో ఎల్లే ఫాన్నింగ్, నికోలస్ హోల్ట్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1892లో అమెరికాలో జరిగిన నిజమైన ఘోరమైన హత్యల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. సొంత తల్లిదండ్రులనే గొడ్డలితో దారుణంగా చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న లిజ్జీ బోర్డెన్ మానసిక పరిస్థితి, ఆ తర్వాతి కోర్టు విచారణల చుట్టూ ఈ కథ నడుస్తుంది.

ది స్కాండల్ (The Scandal)

సన్ యే-జిన్, జీ చాంగ్-వుక్ కాంబినేషన్లో వస్తున్న ఈ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతోంది. జోసోన్ రాజవంశం కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సిరీస్‌లో రాయల్ ఫ్యామిలీ రాజకీయం, వ్యక్తిగత ఆధిపత్య పోరు, ప్రేమ, ప్రతీకారాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఇందులో ఉంటాయి. వీకెండ్స్ లో వీటిలో ఒక్క కంటెంట్ ను అయినా  లైట్స్ ఆఫ్ చేసి చూస్తే వచ్చే ఆ మాజానే వేరు.