
- ఎంపీ కారుపై దాడి ఘటనపై పశ్చాత్తాపం
హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కారుపై రెండు నెలల కింద మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు గురువారం గాంధీభవన్‌కు వచ్చి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఎంపీ వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రమశిక్షణ కమిటీ మంచిర్యాల జిల్లాకు చెందిన ఆరుగురు కాంగ్రెస్ నేతలకు పది రోజుల కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఆ ఆరుగురు నేతలు గురువారం క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై.. ఎంపీ వంశీకృష్ణ అంటే తమకు గౌరవమని, ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆయనతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.