Reading Time: 2 minutes
ముంచుకొస్తున్న కొత్త తుఫాన్! ఆ రోజు నుంచి తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ అప్‌డేట్!

బంగాళాఖాతంలో రాబోయే రోజుల్లో నెలకొనే వాతావరణ మార్పులపై వస్తున్న సూచనలు ఓ పక్క తెలుగురాష్ట్రాల ప్రజలు ఊరటకల్పిస్తూనే మరో పక్క భయాందోళనకు గురిచేస్తున్నాయి. అవును ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారుతుందని.. ఆ తర్వాత అది తుఫాన్‌గా ఏర్పడే ఛాన్స్ ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు ఓ పక్క ఇది మంచి విషయమే అయినప్పటికీ.. భారీ వర్షాలు కురిస్తే ఉన్న పంట నాశనం అవ్వొచ్చనే భయాందోళన కూడా నెలకొంది.

వాతావరణ సంస్థల విభిన్న అంచనాలు

అయితే ఈ తుఫాన్‌ రాకపై ఒక్కో వాతావరణ సంస్థ ఒక్కోలా అంచానా వేస్తోంది. అమెరికన్ మోడల్ వాతావరణ శాఖ ప్రకారం.. ప్రస్తుతం బంగాళాఖాతంలోని అల్పపీడనం సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారి, ఒడిశా లేదా పశ్చిమ బెంగాల్ తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అదే సమయంలో యూరోపియన్ మోడల్ వాతావరణ శాఖ మాత్రం ఇది తీవ్ర తుఫానుగా మారే ఛాన్స్ లేదని, కేవలం అల్పపీడనంగా మాత్రమే బలపడి భారీ వర్షాలు కురిపిస్తుందని స్పష్టం చేసింది.

భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది!

అయితే భారత వాతవారణ శాఖ అంచనా మాత్రం మరోలా ఉంది. ప్రస్తుతం థాయ్‌లాండ్ వైపు నుంచి వచ్చిన ఉపరితల ఆవర్తనం అండమాన్ సముద్రంలోకి ప్రవేశించి బలపడుతుందని పేర్కొంది. ఇది శనివారం నాటికి అల్పపీడనంగా మారి, క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా లేదా అనేది మాత్రం భాతర వాతావరణ శాఖ స్పష్టం చేయలేదు. కాబట్టి ఇప్పుడే పెద్దగా కంగారుపడాల్సిన పనిలేదు!

భారీ వర్షా సూచనలు

అయితే ఈ తుఫాన్ ఏర్పడినా, లేకపోయినా ఈ అల్పపీడనం ప్రభావంతోనైనా రాబోయే రోజుల్లో తెలుగురాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే వాయువ్య బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉందని.. అలాంటి పరిస్థితుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించే అవకాశముంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.