
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి ఎన్టీఆర్ నగర్‌లో నాలుగంతస్తుల భవనం ప్రమాదకరంగా ఒకవైపునకు ఒరిగిపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. కేవలం 30 నుంచి 40 గజాల స్థలంలో నిర్మించిన ఈ నాలుగంతస్తుల భవనం ఒకవైపునకు ప్రమాదకరంగా ఒరిగిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
భవనం ఏ క్షణంలో కూలిపోతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సంభవించేలోపే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.సమాచారం అందుకున్న సీఎంసీ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని భవనాన్ని పరిశీలించనున్నారు.
భవనం పరిస్థితిని పూర్తిగా పరిశీలించి, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.