Reading Time: 2 minutes

ఓట్ చోరీ, ప్రభుత్వ చోరీ.. చివరికి పార్టీ చోరీ: టీఎంసీ ఫ్రీజ్పై రాహుల్ గాంధీ అటాక్

Caption of Image.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఫ్రీజ్ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించడంపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓట్ చేరీ చేశారు.. ప్రభుత్వాన్ని చోరీ చేశారు.. ఇప్పుడు పార్టీని కూడా చోరీ చేస్తున్నారు అంటూ అటాక్ చేశారు. మొదట శివసేన, తర్వాత ఎన్సీపీ, ఆ తర్వాత టీఎంసీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ ఫ్రీజ్ పై 2026 సెప్టెంబర్ 18న ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ప్రతిపక్ష పార్టీలను చీల్చేందుకు బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని ఆరోపించారు. తృణమూల్ పార్టీ, ఆ పార్టీ గుర్తు పూలు, గడ్డి గుర్తును ఫ్రీజ్ చేయడంపై ఆయన ఆగ్రహించారు. భారత ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఓట్లను దొంగిలించడం, ప్రభుత్వాలను దొంగిలించడం.. ఇప్పుడు ఏకంగా పార్టీలను దొంగిలించడం కూడాజ రుగుతోందని అన్నారు. ప్రజలు ఇచ్చిన ఎన్నికల తీర్పును కాపాడటంలో ఈసీ విఫలమైందన్నారు. 

ALSO READ : కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టున్న రైతులను ఇబ్బంది పెట్టం:

ఇది కేవలం వెస్ట్ బెంగాల్ లో మమతాబెనర్జీ కి మాత్రమే జరగటం లేదని.. దేశంలో ఉన్న విపక్ష పార్టీలన్నింటినీ ఈ విధంగానే నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్వేచ్ఛాయుతంగా, నిష్పక్ష పాతంగా జరిగే ఎన్నికలను కోరుకునే పార్టీలను బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి టార్గెట్ చేస్తున్నట్లు విమర్శించారు. 

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరును, ఆ పార్టీ గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీలో రెండు వర్గాలు పార్టీ తమదంటే తమదని క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితుల్లో.. పార్టీ పేరు, గుర్తు ప్రస్తుతానికి ఎవరికీ చెందకుండా ఈసీ ఫ్రీజ్ చేసింది. అక్టోబర్ 6న ఉపఎన్నికలు ఉన్న క్రమంలో.. పార్టీ పేరు, గుర్తులపై ఎవరూ పోటీ చేయకుండా ఆదేశాలిచ్చింది. 

దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా కొత్త పేరు, గుర్తును ఎన్నికల సంఘానికి సమర్పించింది మాజీ సీఎం మమతా బెనర్జీ వర్గం. 2026 సెప్టెంబర్ 18వ తేదీన 11.36 గంటలకు ముందు కొత్త పేరు, సింబల్ ను ఈసీకి సమర్పించింది.

పార్టీ పేరు, గుర్తుపై వివాదం నెలకొన్న సందర్భంగా వచ్చే ఉపఎన్నికల్లో ఆ పేరు, గర్తులతో పోటీ చేయడం కుదరదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ప్రత్యామ్నాయ పేర్లు, గుర్తులను సమర్పించాల్సిందిగా సూచించింది. రానున్న రెండు ఉప ఎన్నికలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. 

28 ఏళ్లుగా మమతాబెర్జీకి సెంటిమెంటుగా వస్తున్న పువ్వులు, గడ్డీతో కూడిన గుర్తు లేటెస్టుగా ఈసీ నిర్ణయంతో ఆ పార్టీకి తాత్కాలికంగా దూరమైంది. 1998 తర్వాత తొలిసారి మమతాబెనర్జీ పార్టీ నేతలు ఆ గుర్తు లేకుండా పోటీ చేయాల్సి వస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.